- Advertisement -
పత్తి లోడుతో వెళ్తున్న ఓ బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలంలో చోటుచేసుకుంది. వెంకటాపురం స్టేజీ సమీపంలో పత్తి లోడుతో ఉన్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. జేసీబీతో వాహనాన్ని బయటకు తీసుకొచ్చారు. గాయపడిన డ్రైవర్ కు చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -