Tuesday, December 31, 2024

అన్నావర్శిటీ అత్యాచార బాధితురాలికి రూ.25 లక్షల నష్టపరిహారం

- Advertisement -
- Advertisement -

చెన్నై లోని అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలో అత్యాచారానికి గురైన బాధితురాలికి రూ. 25 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిట్‌లోని ముగ్గురు సభ్యులు ఐపీఎస్ అధికారులే ఉండాలని స్పష్టం చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ పరిణామాల కారణంగా విద్యార్థిని చదువుపై ఎలాంటి ప్రభావం పడకూడదని తెలిపింది. ఆమె నుంచి ఫీజు వసూలు చేయొద్దని యానివర్శిటీని న్యాయస్థానం ఆదేశించింది. అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై డిసెంబర్ 23 రాత్రి అత్యాచారం జరిగింది. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఓ యువకుడిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనలో నిందితుడికి డిఎంకేతో సంబంధాలున్నాయని బీజేపీ నేతలు అరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News