Friday, January 31, 2025

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరైన భూటాన్ రాజు

- Advertisement -
- Advertisement -

హిమాలయ దేశమైన భూటన్‌లోని బౌద్ధ విహారాలలో దివంగత భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆత్మశాంతి కోసం ప్రార్థనలు జరిగాయి. థింపులోని బౌద్ధ విహారంలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ ప్రార్థనలకు నేతృత్వం వహించాక శనివారం ఆయన ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ స్మశాన వాటికలో రాజు వాంగ్‌చుక్ శ్రద్ధాంజలి ఘటించారు. భూటాన్‌లోని 20 జిల్లాలు లేక జాంగ్‌ఖాగ్‌లలో మన్మోహన్ సింగ్ కోసం ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అంతేకాక సింగ్ గౌరవార్థం భూటాన్ జాతీయ పతాకాన్నిసగం మేరకు అవతనం చేశారు. భూటాన్‌లోని రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో, విదేశాలలో కూడా జాతీయ పతాకాన్ని అవతనం చేశారు. భూటాన్ రాజు నేతృత్వంలో వేలాది మంది తాషిచోడ్జోంగ్‌లోని థింపు కున్రేయ్‌లో వెన్న దీపాలు వెలిగించారు.

ప్రార్థనలకు భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, భారత రాయబారి సుధాకర్ దలేలా, అనేక మంది రాచ కుటుంబ సభ్యులు, భూటాన్ ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు. వివిధ దేశాలలోని భూటాన్ రాయబారకార్యాలయాలు, మిషన్స్, కాన్సులేట్లలో భూటాన్ జాతీయ పతాకాన్ని సగం మేరకు అవతనం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో భారతభూటాన్ సంబంధాలు చాలా అభివృద్ధి చెందాయి. సుహృద్భావం, పరస్పర సహకారం ఆధారంగా రెండు దేశాల నడుమ బలమైన స్నేహసంబంధాలు నెలకొన్నాయి. భారత్‌భూటాన్ స్నేహ సహకార ఒప్పందం 1949లోనే కుదిరింది. కానీ 2007లో దానిని మనమోహన్ సింగ్ హయాంలో పునరుద్ధరించారు. రెండు దేశాల మధ్య హైడ్రోపవర్ రంగంలో ప్రొటోకాల్ సంతకాలు2006లో జరిగాయి. కాగా 2009లో కూడా సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News