Tuesday, December 31, 2024

వాటితో నాకు సంబంధం లేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో రిప్లై అఫిడవిట్ వేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తన సంబంధం లేదని స్పష్టం చేశారు. విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదన్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంక్‌దే అని కెటిఆర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

డబ్బుల చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను హెచ్‌ఎండిఏనే చూసుకోవాలన్న కెటిఆర్ రూ.10 కోట్లు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి కావాలని హెచ్‌ఎండిఎ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. నిధుల బదిలీతో మంత్రిగా తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. 10వ సీజన్ పోటీలు జరగలేదు కాబట్టి రీఫండ్ కోసం ఫార్ములా ఈ రేస్ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చని కెటిఆర్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. కెటిఆర్ అఫిడవిట్ ఈ కేసులో కీలకంగా మారనుందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News