Tuesday, December 31, 2024

వచ్చే ఏడాదిలో కియా నుంచి రానున్న కొత్త కార్లు ఇవే..

- Advertisement -
- Advertisement -

కియా 2025 సంవత్సరంలో భారత మార్కెట్లో తన లైనప్‌ను విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కొన్ని వాహనాలను ప్రదర్శించవచ్చు. కంపెనీ ఈ లైనప్ ఐసిఈ నుండి ఎలక్ట్రిక్ కార్లను కలిగి ఉంది. కంపెనీ 2025 సంవత్సరంలో కొన్ని కొత్త మోడళ్లను తీసుకురానున్నది. అంతేకాకుండా కొన్ని ఫేస్‌లిఫ్ట్‌లను తీసుకురావచ్చు. 2025 సంవత్సరంలో కియా ఏ వాహనాలను రిలీజ్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1.కియా సిరోస్

కియా సిరోస్ ఇటీవల భారతదేశంలో తన గ్లోబల్ అరంగేట్రం చేసింది. ఇది త్వరలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో విడుదల కానున్నది.వచ్చే ఏడాది జనవరి నాటికల్లా మార్కెట్లో విడుదల అవ్వొచ్చు. ఈ కారు ఇది ఆధునిక, ప్రీమియం ఫీచర్స్ తో రానున్నది. ఈ కారు 2.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, హర్మాన్/కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో అమర్చబడి ఉంది. ఇక ఈ కారు అంచనా ధర: రూ. 9.7 లక్షలుగా ఉండొచ్చు.

2. కియా కేరెన్స్ EV

కియా కేరెన్స్ ఇప్పటికే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఏంప్వి. ఇప్పుడు దీని ఎలక్ట్రిక్ వెర్షన్ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో లాంచ్ కావొచ్చు. కియా కేరెన్స్ ఎలక్ట్రిక్ దాని ఐసిఈ వేరియంట్ వంటి అదే డిజైన్, ప్లేస్ పొందవచ్చు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారుగా ఉండబోతోంది. దీని కారణంగా దాని డిజైన్, ఇంటీరియర్‌లలో కొన్ని మార్పులు చూడవచ్చు. ఈ కారు దాదాపు రూ. 15 లక్షలు ఉండొచ్చు.

3.కియా కార్ 2025

కియా ఇండియా 2025 సంవత్సరంలో క్యారెన్స్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా మార్కెట్లో విడుదల చేయొచ్చు. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త లైటింగ్ సెటప్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి కొత్త స్టైలిష్ ఎలిమెంట్‌లను అందించవచ్చు. ఇదే సమయంలో లోపలి భాగాన్ని కూడా మార్చవచ్చు. ఇందులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, అదనపు భద్రతా ఫీచర్లతో అమర్చబడి ఉంటుంది. ఈ కారు దాదాపు రూ. 11 లక్షలు ఉండొచ్చు.

4.కియా ఈవి6 ఫేస్‌లిఫ్ట్

కియా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు ఈవి6 2025 సంవత్సరంలో ప్రధాన నవీకరణలతో విదుదల అవ్వొచ్చు. ఈ కారు మునుపటి కంటే మెరుగైన రేంజ్, ఛార్జింగ్ కెపాసిటీ, కొత్త టెక్నాలజీతో రాబోతున్నది. దీని ఇంటీరియర్‌ని కూడా అప్‌డేట్ చేయవచ్చు. అదే సమయంలో ఈవి6 ఫేస్‌లిఫ్ట్ ఫ్యూచరిస్టిక్ డిజైన్, ప్రీమియం ఫీచర్‌లతో రానున్నది. కాగా, దీని ధర సుమారు 63 లక్షలు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News