Wednesday, January 1, 2025

కెటిఆర్‌కు ఇడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ–రేసు కేసులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం నోటీసులు జారీచేసింది. వచ్చే నెల జనవరి 7న విచారణకు హాజరు కావాల్సిందిగా ఇడి ఆదేశించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత డిజాస్టర్ మేనేజిమెంట్ ముఖ్యకార్యదర్శి ఐఎఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండిఎ రిటైర్డు చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ కాగా, వీరిని జనవరి 2, 3వ తేదీలలో విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసులో ఎసి బి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి ప్రివెన్షన్ మనీలాడరింగ్ యాక్ట్ కింద విచారణ చేపట్టింది. కాగా, తనపై ఎసిబి నమోదు చేసిన కేసు కొట్టివేయాలని హైకోర్టులో కెటిఆర్ క్వాష్ పిటిషన్ వేసిన విష యం తెలిసిందే. దీనిపై ఈ నెల 31 వర కు కెటీఆర్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించడంతో పాటు దీనిపై కౌంటర్ దా ఖలు చేయాలని ఎసిబిని ఆదేశించింది. ఈ మేరకు ఎసిబి శుక్రవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ- రేస్ ఒప్పందాలతో మాజీ మంత్రి కెటిఆర్ ప్రభుత్వానికి నష్టం

కలిగించటం ద్వారా నేరపూరిత దు ష్ప్రవ ర్తనకు పాల్పడ్డారని ఎసిబి తన కౌంటర్‌లో పేర్కొంది. అలాగే మంత్రివ ర్గం, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చె ల్లింపులు చేయాలని అప్పడు సంబంధిత మంత్రి హోదాలో కెటిఆర్ ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమని తన కౌంటర్ లో ఎసిబి పేర్కొంది. విదేశీ సంస్థకు అ నుమతి లేకుండానే రూ.46 కోట్లు చెల్లించగా, దీనికి ఆర్‌బిఐ అనుమతి లేకపోవడంతో రూ. 8 కోట్లు జరిమానా విధించడంతో హెచ్‌ఎండిఎపై భారం పడిందని పేర్కొన్నారు. ఈ కేసులో ఎసిబి దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ పై అసంబద్ధ కారణాల తో కేసు కొట్టి వేయాలని కెటిఆర్ హై కోర్టును ఆశ్రయించడం దర్యాప్తును అ డ్డుకోవటమేనని ఎసిబి పేర్కొంది. చట్టప్రకారం లేదా వాస్తవాలు పరిశీలించినా కెటిఆర్ దాఖ లు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని, దానిని కొట్టివేయాలని హైకోర్టుకు ఎసిబి విజ్ఞప్తి చేసింది. ఈ రే సు నిర్వహణకు మూడేళ్లకు కలిపి మొ త్తంగా రూ.600 కోట్లు వెచ్చించాల్సి ఉం దని, అప్పుడు ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నప్పటికీ ఇసి అనుమతి లేకుండా ఒ ప్పందం చేసుకోవటం ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు.

ప్ర భుత్వం2022లో కుదుర్చుకున్న ఒ ప్పందం మేరకు ఫార్ములా ఈ-రేస్ ట్రాక్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత అని, స్పాన్సర్ తరఫున చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ రికార్డుల ప్రకారం మాజీ మంత్రికెటిఆర్ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్షాధారాలు లభించినట్టు ఎసిబి పేర్కొం ది. తీవ్రమైన నేరాలలో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ప్రాథమిక విచారణ లేకుండా కే సు నమోదు చేయవచ్చన్న సుప్రీంకోర్టు గతంలో తీర్పును ఇచ్చిందని ఎసిబి గు ర్తు చేసింది. ఈ కేసులో ఎ1గా కెటి ఆర్, ఎ 2 గా అరవింద్ కుమార్, ఎ 3 గా బి ఎల్‌ఎన్‌రెడ్డి ఎ3గా ఎసిబి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. కాగా ఎసిబి నమోదు చేసిన కేసు ఆధారంగా దీనిపై ఇడి కూడా మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఇడికి వివరాలు అందజేసిన ఎసిబి
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో వివరాలను ఎసిబి ఇడికి అందజేసింది. ఆర్థికశాఖ రికార్డ్, హెచ్‌ఎండిఎ చెల్లింపుల వివరాలుఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్‌ఐఆర్ కాపీని కూడాఇడికి అందజేసింది.
నాకు సంబంధం లేదు : హైకోర్టులో కెటిఆర్ అఫిడవిట్
ఇలా ఉండగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా హైకోర్టులో తన అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తన సంబం ధం లేదని స్పష్టం చేశారు.

విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదన్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు పై అనుమతుల వ్యవహారం బాధ్యత సం బంధిత బ్యాం క్‌దే అని కెటిఆర్ అఫిడవిట్‌లో పేర్కొన్నా రు. డబ్బుల చెల్లింపుల విషయంలో అ న్ని అంశాలను హెచ్‌ఎండిఏనే చూసుకోవాలన్న కెటిఆర్ రూ.10 కోట్లు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి కావాలని హెచ్‌ఎండిఎ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. నిధుల బదిలీతో మంత్రిగా తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. 10వ సీజన్ పోటీలు జరగలేదు కాబట్టి రీఫండ్ కోసం ఫార్ములా ఈ రేస్ సం స్థకు దరఖాస్తు చేసుకోవచ్చని కెటిఆర్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. కెటిఆర్ అఫిడవిట్ ఈ కే సులోకీలకంగా మారనుందన్నారు.

నిరాధారమైన నిందారోపణలే : బిఆర్‌ఎస్
ఫార్ములా ఈ కేసులో నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు లేవు అని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పార్టీ పే ర్కొన్నది. ఈ కేసు విషయంలో కొన్ని వా ర్తా సంస్థలు పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బిఆర్‌ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా హెచ్చరించింది. ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణ, స్పా న్సర్ లేకపోవడంతోనే ప్రభుత్వం ని ర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇందు లో కుట్ర లేదు, అవినీతి అంతా కన్నా లే దని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం కెటిఆర్ ఒక మంత్రిగా తీసుకున్నారని,హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచడం కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే అని పేర్కొన్న ది. ఫార్ములా ఈ మరో సీజన్‌ను కూడా హైదరాబాద్‌లో నిర్వహించడానికి తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం మా త్రమే అని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News