Wednesday, January 1, 2025

ఏడాదిలో సాధించిన అద్భుత విజయం

- Advertisement -
- Advertisement -

ఇది రాష్ట్ర చరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు
సిఎం రేవంత్‌తో కలిసి చేసిన కృషి
ఫలించింది : రోడ్లు, భవనాల శాఖ
మంత్రి కోమటిరెడ్డి హర్షం

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో సాధించిన అద్భుత విజయం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : రీజినల్ రింగ్ రోడ్ ఉత్తరభాగంలో నా లుగు లేన్ల ఎక్స్‌ప్రెస్ రహాదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు పి లువడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజని రో డ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయమని ఆయనన్నారు. ముఖ్యమంత్రి చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఆర్‌ఆర్‌ఆర్ టెండర్లు అని ఆయనన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు అని ఆయనన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తెలంగాణ బిడ్డల బంగా రు భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు పిలిచిందని, డిసెంబర్ 27 నుంచే టెండర్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 14 టెండర్ల దాఖలుకు చివరి తేదీ అని ఫిబ్రవరి 14న టెండర్లు తెరవనున్నారని ఆయన తెలిపారు. 2017లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించినా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పనులు వెనకబడ్డాయని కోమటి రెడ్డి అన్నారు.

2023 డిసెంబర్‌లో పదవీ చేపట్టిన నాటి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు కోసం నిరంతరం కృషి చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి భూసేకరణపై అనేక సార్లు కలెక్టర్‌లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించామన్నారు. ఓఆర్‌ఆర్ గేమ్ ఛేంజర్ అయితే, ఆర్‌ఆర్‌ఆర్ సూపర్ గేమ్ ఛేంజర్ కాబోతోందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఆర్‌ఆర్‌ఆర్ కీలక భూమిక పోషించబోతున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి చేసిన కృషి ఫలించిందని – మంత్రి అన్నారు. తెలంగాణలో గత పదేండ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగ్ రోడ్డు పనులు ఆలస్యం అయ్యాయని విమర్శించారు. అప్పుడే యుటిలిటీ ఛార్జీలు చెల్లిస్తామని లేఖ ఇచ్చుంటే ఈపాటికి రీజినల్ రింగ్ రోడ్డు పట్టాలెక్కేదని ఆయనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని వివరిస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పెద్ద మనసుతో యుటిలిటీ ఛార్జీలు కూడా కేంద్రమే చెల్లిస్తుందని హామి ఇచ్చారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News