Thursday, January 2, 2025

ఘోర విమాన ప్రమాదం.. 179 మంది సజీవదహనం(వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 181 మందితో కూడిన విమానం బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానం ల్యాండింగ్ సమయంలో గేర్ పనిచేయకపోవడంతో రన్ వేపై దూసుకెళ్లి గోడను ఢీకొట్టింది. దీంతో విమానం పేలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం పూర్తి మంటల్లో ధ్వంసమైంది.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 179 మంది సజీవదహనమయ్యారు. ఘటనాస్థలంలో రెస్క్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టి ఇద్దరిని కాపాడి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఉన్నతాధికారులు ఆధేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News