Thursday, January 2, 2025

తెలంగాణలో విషాదం.. ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో విషాదం సంఘటన చోటుచేసుకుంది. ఒకే జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. వివరాల్లో వెళితే..మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్.. పోలీస్ క్వార్టర్స్ లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికుమార్ సూసైడ్ చేసుకోవడానికి.. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక, సిద్ధిపేటలో ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. భార్య పిల్లలకు విషమిచ్చి.. కానిస్టేబుల్ బాలకృష్ణ ఉరి వేసుకున్న సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ బాలకృష్ణ మృతి చెందగా.. భార్య, పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు ఆత్మహత్య చేసుకుని ఇద్దరు కానిస్టేబుల్స్ చనిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిదిం. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News