Saturday, January 4, 2025

నా నియోజకవర్గంలో 5 వేల ఓట్లను తొలగించేందుకు బిజెపి కుట్ర: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఓటర్ల జాబితా వివాదంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశ రాజధానిలో ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి బిజెపి డిసెంబర్ 15 నుండి ‘ఆపరేషన్ కమలం’ నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. తను పోటీ చేయనున్న న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి ‘ఆపరేషన్ కమలం’ పేరుతో గత 15 రోజుల్లో 5,000 ఓట్లను తొలగించడానికి.. 7,500 ఓట్లను చేర్చడానికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన చెప్పారు. అసెంబ్లీలో మొత్తం ఓటర్లలో సుమారు 12 శాతం మంది ఓటర్లను తారుమారు చేస్తుంటే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని మాజీ సీఎం ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎలాగైనా, నిజాయితీ లేకుండా గెలవాలని బీజేపీ కోరుకుంటోందని, కానీ.. ఢిల్లీ ప్రజలు దీన్ని జరగనివ్వరన్నారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఉపయోగించిన వ్యూహాలను ఇక్కడ ఉపయోగించి గెలవనివ్వబోమని కేజ్రీవాల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News