Saturday, January 4, 2025

‘మన్ కీ బాత్’లో అక్కినేనిని గుర్తు చేసుకున్న మోడీ

- Advertisement -
- Advertisement -

ఈ సంవత్సరం చివరి ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోడీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాకు అక్కినేని చేసిన కృషిని మోడీ కొనియాడారు. తన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలు చూపిస్తూ అక్కినేని టాలీవుడ్‌ను మరొక స్థాయికి తీసుకువెళ్లారని మోడీ ప్రశంసించారు. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తారనేది విదితమే. తాజా ఎపిసోడ్‌లో మోడీ చలనచిత్ర పరిశ్రమ గురించి మాట్లాడారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని మోడీ చెప్పారు.

వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను తొలిసారిగా మన దేశంలో నిర్వహించనున్నట్లు ప్రధాని తెలియజేశారు. ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని మోడీ తెలిపారు. ప్రధాని తన ప్రసంగంలో తెలుగు సహా పలు భాషలకు చెందిన సినీ రంగ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని ఆయన చెప్పారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారత్‌లని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని మోడీ శ్లాఘించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News