Saturday, January 4, 2025

ఈ బుల్లెట్ రైలు వేగం గంటకు 450 కిమీ

- Advertisement -
- Advertisement -

చైనా ఇటీవలే రూపకల్పన చేసిన హై స్పీడ్ బుల్లెట్ రైలు మోడల్ సిఆర్450 ఇఎంయు (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్) ప్రోటోటైప్‌ను ఆదివారం బీజింగ్‌లో ఆవిష్కరించారు. సర్వీస్‌లోకి వచ్చినప్పుడు ఇది గంటకు 400 కిమీ వేగాన్ని అందుకుంటుందని భావిస్తున్నామని, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు కాగలదని చైనా రైల్వే సంస్థ ‘చైనా స్టేట్ రైల్వే గ్రూప్ కంపెనీ’ ఆదివారం ‘గ్లోబల్ టైమ్స్’తో చెప్పింది. ఈ రైలు ప్రయాణ సమయాన్ని మరింత కుదిస్తుందని, దేశంలోని విస్తృత ప్రయాణికులకు ప్రయాణం మరింత సౌకర్యవంతం చేస్తుందని రైల్వే సంస్థ తెలిపింది.

సిఆర్450 ప్రోటోటైప్ గంటకు 450 కిమీ టెస్ట్ స్పీద్ అందుకుందని సంస్థ తెలిపింది. సిఆర్450 అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలులా నిలుస్తుందని సంస్థ అధికారులు చెప్పారు. బీజింగ్ నుంచి షాంఘైకి ప్రస్తుతం నాలుగు గంటలు పడుతుండగా, సిఆర్450 రైలులో కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చునని వారు సూచించారు. ప్రస్తుత సిఆర్ 400 బుల్లెట్ రైలుతో పోలిస్తే దీని బరువు 10 శాతం తక్కువ అని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News