Saturday, January 4, 2025

టోర్నోడోస్‌ల విధ్వంసం:ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని టెక్సాస్, మిస్సిస్పిపిలో శనివారం అనేక టోర్నోడోస్(సుడిగాలులు) విధ్వంసం సృష్టించాయి. ఇద్దరు చనిపోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ టోర్నోడోలకు అనేక ఇండ్లు ధ్వంసం కాగా, వాహనాలు తిరగబడ్డాయి. దక్షిణ హ్యూస్టన్ లోని లివర్‌పూల్ ప్రాంతంలో ఓ వ్యక్తి చనిపోగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని బ్రజోరియా షెరిఫ్ కార్యాలయంకు చెందిన మాడిసన్ పోల్‌స్టన్ తెలిపారు. ఇక మిస్సిస్సిపిలోని ఆడమ్స్ కౌంటీలో ఒకరు చనిపోగా, ఫ్రాంక్లిన్ కౌంటీలో ఇద్దరు గాయపడ్డారు. కాగా బుడే పరిసరం, బ్రాండన్ నగరంలో రెండు టోర్నోడోలు విధ్వంసం సృష్టించాయని అక్కడి నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. హ్యూస్టన్ ప్రాంతంలో ఆరు టోర్నోడోలు వచ్చి ఉంటాయని, వాటిని తమ క్య్రూస్ కనుగొనాల్సి ఉందని నేషనల్ వెదర్ సర్వీస్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త జోష్ లిచ్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News