Saturday, January 4, 2025

డీమ్డ్.. డ్రీమ్స్

- Advertisement -
- Advertisement -

సీట్ల పెంపు, స్వతహాగా భర్తీ.. కొత్త కోర్సులు ప్రవేశపెట్టే అవకాశం కోసం తహతహ సొంతంగా ఫీజుల నిర్ణయం,
రీయింబర్స్‌మెంట్ బకాయిలు తప్పించుకునే ఎత్తుగడ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ నుంచి బయటపడే వీలు
ఎన్‌ఒసి జారీ సమయంలోనే మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలి యోచన

రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలు గా మారేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఫీజులు తక్కువగా ఉండడం, రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కొన్ని కళాశాలలు డీమ్డ్ వర్సిటీలుగా మార్చుకునేందుకు ఆ సక్తి కనబరుస్తున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రైవే ట్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. డీమ్డ్ వర్సిటీగా మారితే సీట్ల పెంపు, భర్తీ, కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకునే అవకాశం వి ద్యాసంస్థకు ఉంటుంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటుంది. అయి తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభు త్వం ఒక్కసారి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌ఒసి) జారీ చేసిన తర్వాత డీమ్డ్ యూనివర్సిటీలపై ఎ లాంటి అధికారం, పర్యవేక్షణ ఉండటం లేదు.

వి ద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నప్పటికీ వి ద్యాశాఖ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉం టుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డీమ్డ్ వర్సిటీలకు అనుమతులు ఇవ్వవద్దని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అనుమతి ఇవ్వాల్సి వస్తే ఎన్‌ఒసి జారీచేసే సమయంలోనే అధికారు లు తనిఖీలు నిర్వహించి ఆయా కాలేజీలు అన్ని నిబంధనలు పాటిస్తున్నాయా..? లేదా..? క్షుణ్ణం గా పరిశీలించి ఏమైనా లోపాలు ఉంటే రిపోర్టు లో పొందుపరచాలని భావిస్తోంది. అలా చేయ డం ద్వారా నిబంధనలు పాటించని కాలేజీలకు యుజిసి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇస్తే తర్వాత యుజిసిని ప్రశ్నించవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. దాంతో పాటు కాలేజీలకు డీమ్డ్ వర్సిటీగా ఎన్‌ఒసి ఇవ్వకుండా ఉండేందుకు చట్టంలోని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు డీమ్డ్ యూనివర్సిటీలపైనా రాష్ట్రాలకు అధికారులు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే చట్టంలో  సవరణలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా సిలబస్‌లో మార్పులపై దృష్టి
రాష్ట్రంలో జెఎన్‌టియుహెచ్, ఇతర యూనివర్సిటీలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ మేరకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను మార్చడంతో పాటు ఉపాధి లభించే కోర్సులపై దృష్టి సారించాలని, అందుకు అనుగుణంగా పరిశ్రమలకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి, జెఎన్‌టియుహెచ్ నిపుణుల కమిటీలు నియమించి సిలబస్‌పై ఆయా సబ్జెక్టు నిపుణులతో అధ్యయనం చేస్తున్నారు. అదేవిధంగా ఐఐటీ మద్రాస్‌తోపాటు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పు చేర్పులు చేస్తూ ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా సిలబస్‌ను రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించడం,అనంతరం ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా పరీక్షల విధానంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు.

ఫీజుల నిర్ణయం.. బకాయిలే డీమ్డ్‌గా మారేందుకు కారణమా..?
ఇంజినీరింగ్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారేందుకు ప్రయత్నించడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కళాశాలగా ఉంటే ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) ఖరారు చేస్తుంది. గతంలో కొన్ని ప్రముఖ కాలేజీలు తమ ఫీజులను పెంచాలని కోరినప్పటికీ ఆ కాలేజీల ఫీజు ఆశించినంతగా పెరగలేదు. చివరకు న్యాయస్థానాలను ఆశ్రయించి ఫీజులను పెంచుకున్నారు. కాలేజీకి డీమ్డ్ యూనివర్సిటీగా మారితే ప్రభుత్వ నియంత్రణ తగ్గడంతోపాటు ఫీజుల నిర్ణయం, రీయింబర్స్‌మెంట్ విధానం వీటికి వర్తించవు. వారే స్వయంగా ఫీజులను నిర్ణయించుకుని వసూలు చేసుకుంటారు. డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తే ప్రవేశాల నుంచి పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల జారీ వరకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేసుకునే అవకాశం విద్యాసంస్థకు ఉంటుంది. డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ప్రవేశాలకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించుకుంటాయి. మౌలిక సదుపాయాలు, మానవ వనరుల ఆధారంగా సీట్లను ఎఐసిటిఇ మంజూరు చేస్తుంది. ఫీజుల నిర్ణయంపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా ఉండదు. విద్యా సంవత్సరాన్నీ ప్రత్యేకంగా పాటిస్తున్నాయి. ఎప్‌సెట్, జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పూర్తి కాకుండానే డీమ్డ్ వర్సిటీలు దాదాపు అన్ని సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News