Saturday, January 4, 2025

సోమవారం రాశి ఫలాలు(30-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మీరు ఆశించిన విధంగా మీ జ్యేష్ట సంతానానికి ఉద్యోగ పరంగా శుభవార్తను అందుకోగలు గుతారు.సామాజికంగా రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి.

వృషభం – కొత్త విషయాలు గ్రహిస్తారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం సక్రమంగానే దొర్లుతుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

మిథునం –  ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు నూతన పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. కీలక నిర్ణయాలలో మీ సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి.

కర్కాటకం – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుండి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు ఆరోగ్య విషయాల పట్ల నిర్లక్ష్యం వద్దు.

సింహం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.  నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం మీకు మేలు కలిగిస్తుంది.

కన్య – ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. అనుకున్నది ఒక్కటి జరిగేది వేరొకటిగా ఉంటుంది.

తుల – పైశాచిక మనస్తత్వం కలిగిన వ్యక్తులు మీకు తారసపడతారు. విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకోని ఖర్చులు ఎదురైన అధిగమిస్తారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు వద్దు.

వృశ్చికం – చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. మధ్యవర్తిత్వాలు షూరిటీ సంతకాలకు దూరంగా ఉండటం మంచిది. సమసిపొయిన సమస్యలే కొత్త కోణంలో తారసబడతాయి.

ధనుస్సు – ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. భవిష్యత్తులో ప్రారంభించబోయే వ్యాపారాలకు గాను వనరులను సమర్చుకునే యత్నాలను ముమ్మరం చేస్తారు.

మకరం – కీలక పత్రాల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించండి. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. మీరు ఎంత సర్దుకుపోయిన వివాదాస్పద వ్యక్తిగానే మీ పైన ముద్ర పడుతుంది.

కుంభం – ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. కొత్త రుణాలను చేస్తారు. ప్రయాణాలు అంతగా లాభించవు.

మీనం – ఉపకరించే మిత్ర వర్గం వలన మానసిక ఊరటను కలిగి ఉంటారు. భూ వివాదాల నుండి బయటపడతారు. మీ మీద ఆధారపడిన వారి కోసం మీ అభిప్రాయాలను మార్చుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News