Saturday, January 4, 2025

ఆసీస్‌కు భారీ ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మక బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఫీల్డింగ్‌లో తీవ్రంగా విఫలమైన టీమిండియా ఆసీస్‌కు లాభాన్ని చేకూర్చింది. దీంతో ఐదో రోజు ఆటపై మరింత ఉత్కంఠ నెలకొంది. భారత స్టార్ పేసర్ల ధాటికి ఆస్ట్రేలియా టాప్ అర్డర్ కుప్పకూలినా టైయిలార్డర్స్ జిడ్డుగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమానికి ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. నాథన్ లియాన్(41 బ్యాటింగ్), స్కాట్ బోలాండ్(10 బ్యాటింగ్) చివరి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 4, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా ఓ వికెట్ దక్కించుకున్నాడు.

బుమ్రా, సిరాజ్ మ్యాజిక్..
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను 369 పరుగులకు ఆలౌట్ చేసిన కంగారూలు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. టీమిండియా పేసర్లు బుమ్రా, సిరాజ్ ధాటికి ఆరు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్ ముగిసే సమయానికి 43 పరుగులు మాత్రమే చేసింది. కొత్త ముఖం కోన్‌స్టాస్(8)ను బుమ్రా.. ఖ్వాజా(21)ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. అనంతరం లబూషేన్ (70), స్టీవ్ స్మిత్(13) ఇన్నింగ్స్‌ను చక్కదిగ్గే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మరోసారి బాల్‌తో మాజిక్ చేసిన సిరాజ్.. స్టీవ్ స్మిత్‌ను పెవిలియన్‌కు పంపాడు. బ్యాటింగ్ వచ్చిన ట్రావీస్ హెడ్(1) బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి నితీశ్‌రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

దీంతో ఆసీస్ 85 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిచెల్ మార్ష్ క్రీజ్‌లోకి వచ్చాక లబూషేన్ నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. ఈ క్రమంలో బుమ్రా అద్భుత డెలివరీతో డకౌట్‌గా క్రీజు వదిలాడు మిచెల్ మార్ష్. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అలెక్ప్ క్యారీ(2)ని సైతం క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా మరింత కష్టాల్లో పడింది. దీంతో లంచ్ విరామానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. లంచ్ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా టీ విరామానికి ముందు కాస్త కుదుటపడింది. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినఆసీస్ ఆ ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. టీ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 135/6గా నమోదైంది.

కెప్టెన్ కమ్మిన్స్ పోరాడినా..
లబూషేన్.. కమిన్స్‌తో (41) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ ఇచ్చిన క్యాచ్‌లను యశస్వి జైశ్వాల్ నేలపాలు చేశాడు. సెంచరీ దిశగా సాగుతున్న లబూషేన్ సిరాజ్ వేసిన మ్యాజిక్ డెలివరీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో గాడిలో పడుతుందనుకున్న ఆస్ట్రేలియాకు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. క్రీజులోకి మిచెల్ స్టార్క్(5) రాగా.. కమ్మిన్స్ ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. రనౌట్ రూపంలో స్టార్క్ పెవిలియన్ చేరగా.. తొలి ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కమ్మిన్స్ వెనుదిరిగాడు. ఈ తరుణంలో ఆసీస్ ఇన్నింగ్స్ ముగియడానికి పెద్ద సమయం పట్టదని అందరూ భావించారు. క్రీజు లో నాథన్ లియాన్, బోలాండ్ ఉన్నారు. వీరిద్ద రూ భారత బౌలర్లకు చిక్కకుండా క్రీజులో పాతుకుపోయారు. ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్‌లో లి యాన్ ఆడిన బాల్ కెఎల్ రాహుల్ దగ్గరకు వెళ్లిం ది. క్యాచ్ పట్టిన రాహుల్ ఔటంటూ సంబరా ల్లో పడిపోయాడు. కానీ.. అది నోబాల్‌గా ఆంపైర్ ప్ర కటించడంతో భారత శిబిరంలో నిరాశ మిగిలింది.

భారత్ 369 ఆలౌట్
358/9 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 11 పరుగులు జోడించి 369 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డి (114) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News