- Advertisement -
ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు చివరి రోజు రెండో ఇన్నింగ్స్ లో భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ(9) మళ్లీ నిరాశ పరిచాడు. అనంతరం వచ్చిన రాహుల్(0), విరాట్ కోహ్లీ(5) కూడా విఫలమయ్యారు. దీంతో 33 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. అనంతరం రిషబ్ పంత్ తో కలిసి మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ టీమిండియా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో జైస్వాల్ అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 41 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్ 88 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్(53), పంత్(14) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 252పరుగులు కావాలి.
- Advertisement -