Saturday, January 4, 2025

అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఆయన బెయిల్ పిటిషన్ పై ఈరోజు పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన అల్లుఅర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అయితే, రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. దీంతో రెండు రోజుల క్రితం అల్లుఅర్జున్ లీగల్ టీమ్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, కౌంటర్ వేసేందుకు తమకు కొంత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో సోమవారానికి విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. మరి, అల్లుఅర్జున్ కు రెగ్యులర్ బెయిల్ వస్తుందా? లేదా? చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News