Saturday, January 4, 2025

మన సాంస్కృతిక చరిత్రలో సజీవుడు శ్యామ్ బెనెగల్

- Advertisement -
- Advertisement -

నా ప్రేయసి తోడు లేకుండా మధుపాత్ర నుండి తాగలేను
ఒక్క క్షణం కూడా జీవించలేను నా ప్రేయసి తోడు లేకుండా
ప్రేమంటే తెలియని వాడు జీవితంలో మొద్దుబారినవాడు
అటువంటివాడి సాంగత్యమే ఊహించలేను నేను

మహమ్మద్ కులీ కుతుబ్ షా రాసిన ఈ ఘజల్, ‘నిశాంత్’ సినిమాలో షబానా ఆజ్మి నసీరుద్దీన్ షాలపై చిత్రించిన ఒక సున్నితమైన సన్నివేశంలో. ప్రీతి సాగర్ స్వరంలో, వనరాజ్ భాటియా సంగీతంలో వెంటాడి వేటాడుతుంది.శ్యామ్ బెనెగల్ తన సినిమాలన్నిటిలో సున్నితమైన కవిత్వాన్ని, దానికనుగుణమైన సంగీతంతో మేళవించిన అద్భుతమైన సన్నివేశాల్ని చిత్రీకరించి మనకందించారు. దాదాపు 52 ఏండ్ల సుదీర్ఘ చలనచిత్ర ప్రయాణంలో ఎన్నో గొప్ప చిత్రాలను మనకందించి, ఎన్నో గొప్ప జ్ఞాపకాలని మనకు మిగిల్చి, శ్యామ్ బెనెగల్ డిసెంబర్ ఇరవై మూడున మన ల్ని వదిలి భౌతికంగా వెళ్లిపోయారు. భారతీయ చలన చిత్ర రంగంలో సమాంతర సినిమాకి ఊపిరులూది, జవ జీవాలిచ్చి, తన తర్వాత అనేక తరాలకి స్ఫూర్తినిచ్చిన మహా దర్శకుడు శ్యామ్ బెనెగల్. చలనచిత్రాలను ఒక ముఖ్యమైన సా మాజిక మాధ్యమంగా గుర్తించిన శ్యామ్ బెనెగల్, ఆ మాధ్యమం ద్వారా సమాజాన్ని ప్రభావి తం చేయడానికి తన జీవిత కాలంలో అహోరాత్రులు శ్రమించారు. తొంభై ఏళ్ళ జీవితకాలం లో 24 పూర్తినిడివి చలనచిత్రాలనూ, 41 డాక్యుమెంటరీలను ఇంకా అనేక లఘుచిత్రాలను, వ్యాపార చిత్రాలను, టీవీ కోసం సీరియల్స్‌నూ నిర్మించారు. తన విస్తారమైన కృషితో మనందరికీ అద్భుతమైన సాంస్కృతిక సంపదను వదిలి వెళ్లిన (మనతోనే ఉన్న) శ్యామ్ బెనెగల్ చిరస్మరణీయుడు.
1974లో తన మొదటి చిత్రం ‘అంకుర్’తో భారతీయ చలనచిత్ర రంగాన్ని ఒక్క కుదుపుకు దిపిన శ్యామ్ బెనెగల్ తన చివ రి రోజులవరకూ సినిమాకే అం కితమై, 2023లో చివరి చిత్రం ‘ముజీబ్: ది మేకింగ్ ఆఫ్ నేషన్’ నిర్మించారు. సినిమాకే తన జీవితాన్ని మొత్తం అంకి తం చేసిన అరుదైన మహా దర్శకుడు శ్యామ్ బెనెగల్.

శ్యామ్ బెనెగల్ కర్ణాటకకు చెందిన వాడైనా తన బాల్యాన్ని, యవ్వనాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గడిపారు. అ ల్వాల్‌లో నివాసం, నిజాం కాలేజీలో చదువు శ్యా మ్ బెనెగల్‌ను నికార్సయిన తెలంగాణ వాసిగా, తెలుగు వాడిగా రూపు దిద్దింది. హైదరాబాద్ నివాసం తనను ఉర్దూ కవిత్వానికి దగ్గరచేసింది, మఖ్దూమ్ మొయినుద్దీన్, కులీ కుతుబ్‌షా తదితర ఉర్దూ కవుల కవిత్వం ఆయనను సంపద్వంతం చేశాయి. తెలంగాణ జీవితం, అందులోని సామాజిక సంబంధాలు ఆయన్ని చలింపజేశాయి. అందుకే తన మొదటి చిత్రం ‘అంకుర్’ ని తెలంగాణ జీవన ఇతివృత్తంతో తీసి ఒక అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దారు. తర్వాత తీసిన ‘నిశాంత్’లోనూ తెలంగాణ జీవితమే. తెలంగాణా జీవన పోరాటమే! తర్వాత కొన్నేళ్ళకు తీసిన ‘సుస్మన్’లో నల్గొండ జిల్లా పోచంపల్లి చేనేత కార్మికుల వెతల్ని ప్రతిబింబించి, ఆ సినిమాలో కబీర్ కవిత్వాన్ని పండిట్ జస్రాజ్‌తో అద్భుతంగా గానం చేయించారు. సినిమాలో అనేకానేక కళలు సమ్మిశ్రితమై, సమన్వయమై సహజీవనం చేస్తాయన్న రహస్యం తెలిసిన అద్భుత మాంత్రికుడు శ్యామ్ బెనెగల్. సినిమా రహస్యం తెలిసిన రసవాది.

శ్యామ్ బెనెగల్ సినిమాలు తీయడం ప్రారంభించిన 1970 దశకం భారత చరిత్రలో, భారతీయ సిని మా చరిత్రలో అతి ముఖ్యమైన సందర్భం. బెంగాలీలో సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, మలయాళంలో ఆదూర్ గోపాల కృష్ణన్, హిందీలో మని కౌల్, కుమార్ షహానీ తదితర గొప్ప దర్శకుల సినిమాలు భారతీయ చలనచిత్ర సమాంతర రంగాన్ని నిర్మిస్తున్నాయి. ఆ సమయంలో రంగప్రవేశం చేసిన శ్యామ్ బెనెగల్ తనదైన శైలిలో ‘అంకుర్’, ‘నిశాంత్’, ’మంథన్’, ’జునూన్’ సినిమాలు సృష్టించి ఒక గొప్ప కొత్త అద్భుతాన్ని సృష్టించారు. ఐతే శ్యామ్ బెనెగల్‌కూ అంతకు ముందు వచ్చిన కళాత్మక సినిమాలకు ముఖ్యమైన తేడాలున్నాయి, అందుకే శ్యామ్ బెనెగల్ సినిమాలు భారతీయ సినిమాకు ఒక కొత్త దృక్కోణాన్ని అందించాయి. భారతీయ సమాజంలోని భూస్వామిక సామాజిక సంబంధాలను అత్యంత నిశితంగా, ఆధిపత్య నిర్మాణ కేంద్రాల, ధోరణుల నేపథ్యంలో శ్యామ్ బెనెగల్ తన సినిమాల్లో పరిశీలించారు. తెలంగాణ భూస్వామ్య సామాజిక సంబంధాల నేపథ్యంలో వర్గ, కుల, లింగ ఆధిపత్యాలని ఇంత స్పష్టంగా, ఇంత నిశితంగా పరిశీలించిన సినిమాలు మరొకటి లేవు అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ‘అంకుర్’లో ఒక దళిత స్త్రీకి తన యజమానికి, తన మూగ భర్తకీ మధ్య త్రికోణ సంబంధాన్ని వర్గ, కుల, లింగ వివక్షల, ఆధిపత్యాల నేపథ్యంలో చిత్రీకరించారు.

శ్యామ్ బెనెగల్ ఒక గొప్ప కళాకారుడే కాదు గొప్ప మేధావి కూడా. తన చుట్టూ సమాజాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. బాగా చదువుకున్నారు, ఒక గొప్ప సిని మా దర్శకునికి అధ్యయనం ఎంత ముఖ్యమో శ్యామ్ బెనెగల్ సిన్మాలు చూస్తే తెలుస్తుంది. సరైన శాస్త్రీయ ప్రాపంచిక దృక్పథంతో అధ్యయ నం చేయడం, తన నిజ జీవితం నుండి స్వీకరించిన అనేకానేక అనుభవాలను అధ్యయన నేప థ్యంలో దర్శించడం, ఒక కళాకారునిగా వాటిని అద్భుతంగా దృశ్యమానం చేయడం శ్యామ్ బెనెగల్‌కే సాధ్యమైంది. సమాజంలోని ఆధిపత్య కేం ద్రాలను, నిర్మాణాలను, సంబంధాలను వాటిలో ని సంక్లిష్టతను అర్థం చేసుకుని, ఎక్కడా కృత్రిమ త్వం లేకుండా, సందేశాత్మకత లేకుండా, సూచనప్రాయంగానే తిరుగుబాటుని, విప్లవాన్ని చెప్పి న గొప్ప విప్లవాత్మక దర్శకుడు శ్యామ్ బెనెగల్.
(తరువాయి వచ్చే వారం)

నారాయణస్వామి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News