Saturday, January 4, 2025

బాక్సింగ్ డే టెస్టు: ట్రీ బ్రేక్.. టీమిండియా 112/3

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు చివరి రోజు రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఆచితూచి ఆడుతోంది. 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. ఇప్పటికే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఓపెనర్ రోహిత్ శర్మ(9), రాహుల్(0), విరాట్ కోహ్లీ(5)లు మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. 33 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రిషబ్ పంత్ తో కలిసి ముందుకు నడిపించే బాధ్యతను మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తీసుకున్నాడు. ఈ క్రమంలో జైస్వాల్ అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 54 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్ 112 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్(63), పంత్(28)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 228పరుగులు కావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News