Saturday, January 4, 2025

తెలంగాణకు పురుడు పోసిన డాక్టర్.. మన్మోహన్ సింగ్: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు పురుడు పోసిన డాక్టర్.. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మన్మోహన్ సింగ్ ఆత్మబంధువు అని.. తెలంగాణ స్వప్నం సాకారం చేసిన ఆయనకు నాలుగు కోట్ల ప్రజల తరుపున నివాళులర్పిస్తున్నట్లు సిఎం చెప్పారు.తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్ సింగ్ స్థానం శాశ్వతమని అన్నారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా సోమవారం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది.

రాష్ట్ర ఏర్పాటులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కృషిని కొనియాడుతూ సిఎం రేవంత్ రెడ్డి సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్టమైన సేవలు అందించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలి. నిర్మాణాత్మక సంస్కరణ అమలులో మన్మోహన్ సింగ్ ది కీలకపాత్ర. ఈ తరంలో ఆయనతో పోటీ పడేవారు లేరు. ఎవరు, ఎన్ని విమర్శలు చేసినా పనినే ధ్యాసగా ఆయన భావించేవారు. నీతి, నిజాయితీతో ఆయన పని చేశారు. ఉపాధి హామీ, ఆర్టీఐ వంటి చట్టాలను తెచ్చిన ఘనత ఆయనది. సరళీకృత విధానాలతో భారత్.. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టింది మన్మోహన్ సింగ్ నాయకత్వమే” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News