Sunday, January 5, 2025

మన్మోహన్‌ సింగ్.. దేశ గతి, గమనాన్ని మార్చారు: కూనంనేని

- Advertisement -
- Advertisement -

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. భారత దేశ గతి, గమనాన్ని మార్చారని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యే అసెంబ్లీ సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ.. నిజాయతీ, నిబంద్ధతకు నిలువుటద్దం మన్మోహన్‌ సింగ్‌ అని తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మన్మోహన్‌కు నివాళి అర్పించే కార్యక్రమంలో రాజకీయాలు తగదన్నారు. సంతాప సభల్లో వేరే అంశాలను జోడించడం ఇంతకు ముందెన్నడూ చూడలేదని.. నివాళి కార్యక్రమంలో ఇలా చేయడం వల్ల మన్మోహన్‌ ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. నివాళి కార్యక్రమంలో ఆయన గొప్పతనాన్ని చెప్పాలని సూచించారు.

అంతకుముందు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి మన్మోహన్‌ చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని చెప్పారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారని.. పీవీకి దక్కనటువంటి గౌరవం.. మన్మోహన్‌కు దక్కిందని తెలిపారు. పీవీ నరసింహారావుకు భారతరత్న బీజేపీ హయాంలోనే వచ్చిందని.. కానీ, పీవీకి భారతరత్న ఇచ్చే కార్యక్రమానికి కూడా కాంగ్రెస్‌ నేతలు హాజరుకాలేదని విమర్శించారు. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్డినెన్స్‌ను రాహుల్‌ గాంధీ చించివేశారని ఏలేటి అన్నారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు, మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో శాసనసభలో స్వల్ప గందరగోళం నెలకొంది. అనంతరం మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News