Sunday, January 5, 2025

జియో, ఎయిర్‌టెల్ కు పోటీగా ఐడియా కొత్త రీఛార్జ్ ప్లాన్స్..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ టెలికాం సంస్థ ఐడియా ఇటీవల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అయితే, ఈ ప్లాన్లు రూ. 150లోపు ఉండడం విశేషం. ఈ ప్లాన్స్ తక్కువ కాల్స్ మాట్లాడేవారికి, ఇంటర్నెట్‌ని ఉపయోగించే వారికీ, ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే కస్టమర్‌ల కోసం ఉత్తమ ఎంపిక. ఈ రెండు కొత్త ప్లాన్‌లు నేరుగా జియో, ఎయిర్‌టెల్‌తో పోటీ పడుతున్నాయి. అయితే, జియో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి డేటా ప్లాన్ ధర రూ. 189గా ఉంది. మరోవైపు.. ఎయిర్‌టెల్ కు ప్లాన్ ధర రూ.121గా ఉంది. ఇందులో కాలింగ్ సౌకర్యం లేదు.ఈ క్రమంలో ఐడియా ప్రవేశ పెట్టిన కొత్త ప్లాన్ల గురుంచి చూద్దాం.

రూ.128 ప్లాన్

రూ. 128 ప్లాన్ 18 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో 100MB డేటా కూడా వస్తుంది. ఒకవేళ మీ ఫోన్ ను ఎక్కువగా వై ఫై కు కనెక్ట్ చేసుకుంటే ఇది పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది 10 స్థానిక ఆన్-నెట్ నైట్ నిమిషాలతో వస్తుంది. దీనిని రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉపయోగించవచ్చు. అయితే, అన్ని స్థానిక, జాతీయ కాల్‌లకు మీరు సెకనుకు 2.5 పైసలు చెల్లించాలి. ఇక మీరు ఈ ప్లాన్‌లో SMS పంపలేరు.

రూ. 138 ప్లాన్

రెండవ ప్లాన్ గురించి మాట్లాడితే.. దీని ధర రూ. 138గా ఉంది. దీనిలో 20 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కూడా పైన పేర్కొన్న ప్లాన్ వలె, మీరు రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల మధ్య 10 స్థానిక ఆన్-నెట్ నైట్ నిమిషాలు, 100MB మొబైల్ డేటాను పొందుతారు. అలాగే, మీరు అన్ని స్థానిక, జాతీయ కాల్‌లకు సెకనుకు 2.5 పైసలు చెల్లించాలి. ఇందులో కూడా మీరు ఎటువంటి SMS పంపలేరు.

ఐడియా కంపెనీ ప్రకారం.. కొత్త రూ.128, రూ.138 ప్లాన్‌లు ప్రస్తుతం అన్ని ప్రాంతాలలో అందుబాటులో లేవు. కేవలం మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, చెన్నై, కేరళ, కోల్‌కతా వంటి సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News