Saturday, January 4, 2025

జియో యూజర్లకు భారీ షాక్..

- Advertisement -
- Advertisement -

ఇటీవల ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్, ఐడియా రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో అనేక యూజర్లు ప్రభుత్వ టెలికాం సంస్థ అయినా బిఎస్ఎన్ఎల్ కు తమ సిమ్ ను పోర్ట్ చేసుకున్నారు. దీంతో ఎంతో లాభంపొందిన బిఎస్ఎన్ఎల్ తమ కొత్త యూజర్లను ఆకర్షించేందుకు అనేక కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇది ఇలా ఉంటె మరోసారి జియో కొత్త సంవత్సరానికి ముందు తన మిలియన్ల మంది వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ రెండు ప్లాన్‌లపై వాలిడిటీని తగ్గించింది. ఈ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.

డేటా పరిమితిని చేరుకున్న తర్వాత స్వల్పకాలంలో మిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగించే రూ. 19, రూ. 29 డేటా వోచర్ ప్లాన్‌ల చెల్లుబాటును తగ్గించింది. నివేదిక ప్రకారం, అంతకుముందు రూ. 19 రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు వినియోగదారు యాక్టివ్ ప్లాన్‌కు సమానంగా ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే.. వినియోగదారులు 84 రోజులు రీఛార్జ్ చేసుకుంటే, రూ. 19 ప్లాన్ చెల్లుబాటు 84 రోజులకు కూడా అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు కంపెనీ దానిని 1 రోజుకు మార్చింది. అంటే రూ.19 డేటా ప్లాన్ వాలిడిటీ ఇప్పుడు 1 రోజు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా.. రూ.29 డేటా ప్లాన్‌లో కూడా ఇదే విధమైన మార్పు చేసింది జియో. దీని వ్యాలిడిటీ కూడా బేస్ యాక్టివ్ ప్లాన్ నుండి తగ్గించబడింది. అయితే, కొన్ని నెలల క్రితం వరకు ఈ రూ.19 ప్లాన్ ధర రూ.15గా ఉండేది. మరోవైపు.. రూ.29 ప్లాన్ రూ.25కి అందుబాటులోకి వచ్చింది. అయితే టారిఫ్ పెంపు తర్వాత కంపెనీ వినియోగదారుల జేబులపై భారం పెంచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News