Sunday, January 5, 2025

అల్లుఅర్జున్ ను ఒంటరిని చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యలో హీరో అల్లుఅర్జున్ ను ఒంటరిని చేసేశారని ఆయన కీలక కామెంట్స్ చేశారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన పవన్.. అల్లుఅర్జున్ ఎపిసోడ్ పై స్పందించారు. ఈ అంశం గోటితో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకోవడమేనన్నారు. సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని, అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుందన్నారు. కానీ, థియేటర్ వెళ్లే ముందు ఏర్పాట్లు చేసుకోవాల్సిందని చెప్పారు.

సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని.. ఘటన జరిగిన రెండో రోజే బాధితులను పరామర్శించాల్సిందని పవన్ అన్నారు. అల్లు అర్జున్ వెళ్లక పోయినా కనీసం చిత్ర యూనిట్ అయినా.. బాధితుడి ఇంటికి వెళ్లి ఉండాల్సిందని, అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని చెప్పారు. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని.. అది చేయకపోవడం వల్లే ఇంతవరకు వచ్చిందన్నారు.ఈ విషయంలో హీరోని చిత్రయూనిట్ ఒంటరిని చేసిందని పవన్ అన్నారు.

“తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించింది. పుష్ప2 సినిమాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ప్రోత్సాహం ఇచ్చింది. స్పెషల్ షోలు, టికెట్ రెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ విషయంతో ఏం చేయాలన్నా.. రెండు వైపుల పదునున్న కత్తిలా రేవంత్ రెడ్డి పరిస్థితి మారింది. అల్లుఅర్జున్ అనే కాదు ఎవరి విషయంలోనైనా రేవంత్ విధానం ఒకటేనని.. చట్టం కూడా ఎవరిని విడి విడిగా చూడదు” అని పవన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News