Sunday, January 5, 2025

చనిపోయిన రైతులు, నేతన్నలు, విద్యార్థులకు.. రూ.25లక్షల పరిహారమివ్వాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఏ విధంగా రూ.25 లక్షలు ఇచ్చారో.. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కూడా అదే విధంగా రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని విమర్శించారు.

ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించారని.. అటెన్షన్‌, డైవర్షన్‌ కోసమే రేవంత్‌రెడ్డి పాకులాడారని మండిపడ్డారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలతోపాటు ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు. రాష్ట్రంలో రైతన్నలు, నేతన్నల మరణాలపై రేవంత్ స్పందించాలని అందరికీ కనీసం రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News