Sunday, January 5, 2025

జనవరి 2 నుంచి ఆమరణ నిరాహారదీక్ష : ప్రశాంత్ కిశోర్

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సి) కంబైన్డ్ కాంపిటీషన్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్టు ఆరోపణలు రావడంతో గత పదిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వీరిపై ఆదివారం పోలీస్‌లు జలఫిరంగులు ప్రయోగించి, లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యలను జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు , రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఖండించారు. పోలీస్‌ల చర్యకు నిరసనగా జనవరి 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. దీనిపై మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని ప్రకటించారు.

ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి పోలీస్‌లు విద్యార్థులపై లాఠీఛార్జి చేస్తున్న సమయంలో ప్రశాంత్ కిశోర్ అక్కడ నుంచి వెళ్లిపోతున్నట్టుగా పలు వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విద్యార్థులు ఆయనను తమపై పోలీస్‌లు లాఠీ ఛార్జీ చేస్తుండగా, అక్కడ నుంచి ఎందుకు వెళ్లిపోయారని నిలదీశారు. నిరసన ప్రాంతం నుంచి ప్రశాంత్ కిశోర్ వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అయితే విద్యార్థుల ఆరోపణలను ప్రశాంత్ కిశోర్ ఖండించారు. వారి ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. పోలీస్‌లు లాఠీఛార్జి చేస్తుండటంతో విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లాలని సూచిస్తూ తాను మరో చోటికి వెళ్లానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News