Sunday, January 5, 2025

అర్చకులకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ వరాల జల్లు

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఆలయాలు, గురుద్వారాల్లో పనిచేసే పూజారులు, గ్రంధీల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. తాము అధికారం లోకి వస్తే , వారికి నెలకు రూ.18 వేలు గౌరవవేతనంగా అందజేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు మన ఆచారాలను అందజేయడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నా , వారి ఆర్థిక స్థితిని ఎవరూ పట్టించుకోవట్లేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ పథకం రిజిస్ట్రేషన్ రేపటి నుంచి ప్రారంభం అవుతుందన్నారు. హనుమాన్ ఆలయంలో తానే ఈ ప్రక్రియను ప్రారంభిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు కలిగించవద్దని బీజేపీని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News