Sunday, January 5, 2025

జడ్జీల సమీప బంధువులకు హెచ్‌సి జడ్జి పదవి

- Advertisement -
- Advertisement -

ఆ ప్రతిపాదనను ఎస్‌సి కొలీజియం వ్యతిరేకించవచ్చు
న్యూఢిల్లీ : జడ్జీల సమీప బంధువులను హైకోర్టుల్లో జడ్జీలుగా నియమించరాదన్న ప్రతిపాదనను సుప్రీం కోర్టు (ఎస్‌సి) కొలీజయం పరిశీలించవచ్చునని అభిజ్ఞ వర్గాలు సూచించాయి. ఆ ప్రతిపాదనను సీనియర్ న్యాయమూర్తి ఒకరు చేసినట్లు తెలుస్తోంది. దానికి అంగీకరించినట్లయితే, అటువంటి నియామకాల్లో మరింతగా సమ్మిళితాన్ని తీసుకువచ్చినట్లు అవుతుంది, న్యాయవ్యవస్థ నియామాకాలోల ప్రతిభ కన్నా బంధుత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే భావనను అంతం చేస్తుంది. తల్లిదండ్రులు లేదా సమీప బంధువులు సుప్రీం కోర్టులో గాని, హైకోర్టులో గాని ప్రస్తుత లేదా పూర్వపు న్యాయమూర్తులుగా ఉన్న అభ్యర్థులను సిఫార్సు చేయవద్దని హైకోర్టు కొలీజియాలను ఆదేశించాలన్న సూచనను ఎస్‌సి కొలీజియం పరిశీలించవచ్చునని ఆ వర్గాలు తెలిపాయి.

ఆ ప్రతిపాదన అర్హులైన కొందరు అభ్యర్థులను అనర్హులను చేయవచ్చు. కాగా, మొదటి తరం న్యాయవాదులకు అవకాశాలను అది తెరుస్తుందని, రాజ్యాంగ న్యాయస్థానాల్లో విభిన్న వర్గాల ప్రాతినిధ్యాన్ని విస్తృతంచేస్తుందని ఒక ప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ఉన్నత న్యాయవ్యవస్థలో సిట్టింగ్ లేదా పూర్వపు న్యాయమూర్తులతో బంధుత్వం ఉన్న కారణంగా అర్హులైన వారికి న్యాయమూర్తి పదవిని అన్యాయంగా తిరస్కరించినట్లు కాగలదని ఆ ప్రతినిధి అన్నారు. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేసే ముగ్గురు సభ్యుల కొలీజియంలో భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సూర్య కాంత్ ఉన్నారు.

హైకోర్టులలో న్యాయమూర్తి పదవికి పేర్లను నిర్ణయించి, సిఫార్సు చేసే విస్తృత ఐదుగురు సభ్యుల కొలీజియంలో న్యాయమూర్తులు హృషీకేశ్ రాయ్, అభయ్ ఎస్ ఓకా కూడా ఉన్నారు. హైకోర్టుల్లో పదోన్నతి కోసం సిఫార్సు చేసిన న్యాయవాదులు, న్యాయాధికారులతో వ్యక్తిగత సంప్రదింపులను సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం ఇటీవల ప్రారంభించింది. దీనితో సాంప్రదాయక బయోడేటా, లిఖిత మదింపులు, నిఘా నివేదికల దశ నుంచి మళ్లినట్లు అయింది. ఎస్‌సి కొలీజియం ఈ నెల 22న సమావేశాలు నిర్వహించి, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బొంబాయి. అలహాబాద్ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియామకానికి దాదాపు ఆరు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News