Sunday, January 5, 2025

ఆత్మహత్మగా కనిపించడం లేదు

- Advertisement -
- Advertisement -

సుచిర్ బాలాజీ మృతిపై ఎలాన్ మస్క్
ఎఫ్‌బిఐ దర్యాప్తునకు సుచిర్ తల్లి డిమాండ్

వాషింగ్టన్ : ఒపెన్ ఎఐ మాజీ ఉద్యోగి, విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ మరణంపై వివాదం కొత్త మలుపు తిరిగింది. తెర వెనుక ఏదో జరిగిందని అతని తల్లి పూర్ణిమా రామారావు ఆరోపించి, దీనిపై ఎఫ్‌బిఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. తన కుమారుని మరణం ‘ఎవరో ప్లాన్‌తో చేసిన హత్య’ అని ఆమె ఆరోపించారు. బాలాజీది ‘ఆత్మహత్య అని అధికారులు ప్రకటించారు’ అని ఆమె పేర్కొన్నారు, ‘మేము ఒక ప్రైవేట్ దర్యాప్తు వ్యక్తిని నియోగించాం. మరణ కారణం తెలుసుకోవడానికి రెండవ ఆటాప్సీ జరిపించాం. పోలీసులు పేర్కొన్న మరణ కారణాన్ని ప్రైవేట్ ఆటాప్సీ ధ్రువీకరించలేదు’ అని పూర్ణిమ ‘ఎక్స్’ పోస్ట్‌లో వివరించారు.

అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో భాగం కానున్న ఎలాన్ మస్క్‌కు, వివేక్ రామస్వామికి ఆమె ఆ పోస్ట్‌ను అనుసంధానించారు. ‘సుచిర్ అపార్ట్‌మెంట్‌ను చిందరవందర చేశారు. బాత్‌రూమ్‌లో ఘర్షణ చిహ్నం కనిపించింది. బాత్‌రూమ్‌లో రక్తం మరకలను బట్టి అతనిని ఎవరో కొట్టినట్లు కనిపిస్తోంది. ఎవరో ప్లాన్ ప్రకారం చేసిన హత్య అది. కానీ అధికారులు దానిని ఆత్మహత్యగా ప్రకటించారు.

శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో లాబీయింగ్ న్యాయం పొందకుండా మమ్మల్ని ఆపలేదు. ఎఫ్‌బిఐ దర్యాప్తును కోరుతున్నాం’ అని పూర్ణిమ తెలిపారు. పూర్ణిమ పోస్ట్ మస్క్ దృష్టిని ఆకర్షించింది. ఆమె వాదనకు ‘ఎక్స్’ పోస్ట్‌తోనే మస్క్ స్పందిస్తూ, ‘ఇది ఆత్మహత్య వలె కనిపించడం లేదు’ అని అన్నారు. ఓపెన్ ఎఐ ప్రస్తుత సిఇఒ టామ్ ఆల్ట్‌మన్‌తో మస్క్‌కు సత్సంబంధం లేకపోవడం గమనార్హం. ఓపెన్ ఎఐ వ్యవస్థాపక సభ్యుల్లో మస్క్ ఒకరు. కానీ 2018లో విభేదాలతో ఆయన సంస్థ నుంచి నిష్క్రమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News