Sunday, January 5, 2025

ఆధునికత ముసుగులో అసభ్యత, అశ్లీలత…

- Advertisement -
- Advertisement -

సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాలకు పిల్లలు దూరంగా ఉండేలా చూడాలి
మార్గదర్శకాలతో బుక్‌లెట్‌ను విడుదల చేసిన తెలంగాణ పోలీసు శాఖ
పిల్లలను రక్షించుకోవాలని తల్లిదండ్రులకు సూచన

మనతెలంగాణ/హైదరాబాద్: ఆధునిక యుగంలో విద్యార్థులను కొన్ని యాప్‌లు పక్కదారి పట్టిస్తున్నాయి. కొన్ని యాప్‌లు విద్యార్థులకే మేలు చేస్తున్నా కొన్నిమాత్రం వారిని దుష్ప్రభావాల వైపు మళ్లీస్తున్నాయి. ఆధునికత ముసుగులో అసభ్యత, అశ్లీలత పేరుతో విద్యార్థులను చిదిమేస్తున్న యాప్‌లు, సోషల్‌మీడియాపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక కరదీపికను విడుదల చేశారు. విద్య, ఇతర అవసరాలకు మొబైల్ ఫోన్ పిల్లలకు ఇవ్వడం తప్పనిసరి కావడంతో పిల్లలు తెలియకుండానే సైబర్ ఇక్కట్ల విష విలయంలో వారు చిక్కుకుంటున్నారు. ఆయా యాప్‌ల నుంచి వచ్చే దుష్ప్రభావాల నుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలన్న దానిపై తెలంగాణ పోలీసులు ఈ కరదీపికను రూపొందించారు. భావితరాలకు సైబర్ భద్రతను అందించేందుకు దానిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. దానిని వినియోగించుకొని పిల్లలను రక్షించుకోవాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

నియంత్రణ ఎలా..?
మొబైళ్లు, కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి. వాటిలోకి సైబర్ మోసాలకు పాల్పడే వారు చొరబడకుండా వాటి బారిన పిల్లలు పడకుండా ఎలా చూడాలో ఈ కరదీపికలో వివరించారు. అందులోని వివరాలు ఇలా…
పిల్లల వయస్సుకు తగినట్లు మార్గదర్శకాలు రూపొందించడం.
ఇంటర్‌నెట్‌ను సురక్షితంగా ఎలా వినియోగించుకోవాలో వివరించడం.
మొబైల్స్, కంప్యూటర్లు నిర్ణీత సమయంలోనే వినియోగించుకునేలా చూడడం.
పిల్లలు తమకు ఎదురైన అనుభవాలను ధైర్యంగా తెలియజేసేలా చేయడం.

గుర్తించడం ఎలా..?

పిల్లలు ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాల్లో ఉండడంతో పాటు ఒంటరితనంగా గడుపుతుంటే వారు ఏదో విష వలయంలో చిక్కుకున్నారని గుర్తించాలి. ఎవరైనా అసభ్య సందేశాలు, అశ్లీల వీడియోలు పంపితే వాటిని గుర్తించి స్క్రీన్ షాట్ల రూపంలో భద్రపర్చి సైబర్ ఠాణాల్లో ఫిర్యాదుచేయాలి. పిల్లలు వాటి దుష్ప్రభానికి లోనైతే అవసరమైతే ఉపాధ్యాయులు, కౌన్సెలర్లను సంప్రదించి వారు అందులో నుంచి బయటపడేలా చూడాలి.

ఏ విధంగా అడ్డుకోవాలి…

ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), యూ ట్యూబ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్ యాప్‌ల ద్వారా అసభ్య, అవాంఛిత సమాచారం చేరకుండా సెట్టింగ్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో పోలీసులు వివరించారు. ఇతర సెట్టింగ్‌లో మార్పుల గురించి సమగ్ర సమాచారం పొందుపర్చారు.

సైబర్ చట్టాల వివరణ…

పిల్లలు సైబర్ నేరాల బారిన పడితే వారిని ఎలా రక్షించుకోవాలి. ఏ విధంగా ఫిర్యాదు చేయాలన్న దానిపై అందులో ఉపయోగపడే చట్టాలను వివరించారు. ఈ విషయంలో మరిన్ని వివరాలకు https://tgcsb.tspolice.gov.in/ సంప్రదిచవచ్చు లేదా 1930 నెంబర్‌కు డయల్ చేయాలని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News