Sunday, January 5, 2025

విఎల్‌ఓ కోసం భారీగా దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

9,654 మంది ఆప్షన్‌లను ఆమోదించిన రెవెన్యూ శాఖ
త్వరలోనే వారికి పరీక్ష నిర్వహించి విధుల్లోకి తీసుకునే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్:  క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం త్వరలో అమల్లోకి తీసుకురానున్న విఎల్‌ఓ (గ్రామస్థాయి అధికారులు) వ్యవస్థలో పనిచేయడానికి పలువురు విఆర్‌ఓ, విఆర్‌ఏలు ముందుకొచ్చారు. ఈనెల 24వ తేదీన దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి ఆప్షన్‌లను ప్రారంభించి 28వ తేదీ వరకు ఈ ఆప్షన్‌లను స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి 9,654 మంది (గతంలో విఆర్‌ఓ, విఆర్‌ఏలుగా) పనిచేసిన వారు తిరిగి రెవెన్యూ వ్యవస్థలోకి రావడానికి ఈ ఆప్షన్‌లు ఇచ్చారు. సంక్రాంతిలోపు వారికి పరీక్ష పెట్టి వారిని రెవెన్యూ వ్యవస్థలోకి ప్రభుత్వం తీసుకోనుంది.

ఈ ఆప్షన్‌ల కింద 11,783 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో డూప్లికేట్ అండ్ మల్టీపుల్ ఆప్షన్ కింద డబుల్ ఆప్షన్‌లు రావడంతో అందులో నుంచి 2,065 దరఖాస్తులను రెవెన్యూ శాఖ తిరిస్కరించింది. అనంతరం 9,718 ఆప్షన్‌లను ఆమోదించగా అందులో ఎంప్లాయి ఐడి 21 మంది, మరో 21 మంది సర్టిఫికెట్‌లను సమర్పించకపోవడంతో వారి ఆప్షన్‌లను ప్రభుత్వం తిరస్కరించింది. మిగిలిన 9,654 మంది ఆప్షన్‌లను రెవెన్యూ శాఖ ఆమోదించింది. ఇందులో గతంలో విఆర్‌ఓలుగా పనిచేసిన వారిలో 3,534 మంది ఆప్షన్‌లు ఇవ్వగా వారిలో డిగ్రీ చేసిన వారు 1,516 మంది, ఇంటర్ చేసిన వారు 1,347 మంది, ఇతరులు 614 మంది ఉన్నారు.

గతంలో విఆర్‌ఏలుగా పనిచేసిన వారిలో 5,987 మంది ఆప్షన్‌లు ఇవ్వగా వారిలో డిగ్రీ చేసిన వారు 1,926 మంది, ఇంటర్ చేసిన వారు 1,280 మంది, ఇతరులు 2781 మంది ఉన్నారు. ఇతరుల నుంచి 133 ఆప్షన్‌లుగా రా, అందులో డిగ్రీ చేసిన 56 మంది, ఇంటర్ చేసిన వారు 37 మంది, ఇతరులు 40 మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,594 రెవెన్యూ గ్రామాల్లో వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. అయితే గత ప్రభుత్వం 2020 సంవత్సరంలో విఆర్‌ఓ వ్యవస్థను, 2022లో విఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని వేరే శాఖల్లోకి పంపించింది. ప్రస్తుతం వారిలో ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రభుత్వం ఆప్షన్‌లను స్వీకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News