Sunday, January 5, 2025

మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు ఆయన ఆత్మ బంధువు
ఐటీలో ప్రపంచాన్ని భారత్ శాసిస్తోందంటే
మన్మోహన్ సరళీకృత విధానాలే కారణం
తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన స్థానం
ఎప్పటికీ శాశ్వతమే శాసనసభలో సంతాప
తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్
మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్
తీర్మానం..మద్దతు ప్రకటించిన కెటిఆర్
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్
విగ్రహం ఏర్పాటు శాసన సభలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సోమవారం జరిగింది. మాజీ ప్రధానమంత్రి మ న్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజుల పా టు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ప్రకటించిం ది. సంతాప దినాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా మన్మోహ న్ సింగ్‌కు నివాళులర్పించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. సోమవారం అసెంబ్లీలో మాజీ ప్రధా ని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని పెట్టిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణకు ఆత్మ బంధువు అని అన్నారు. 2013లో భూసేకరణ చట్టంతో గ్రామాల్లో నిరుపేదలకు కూ డా సాయం అందిందన్నారు. గ్రామాల్లో భూమి లేని వారికి కూడా నష్ట పరిహారం అందించేలా చట్టం చేశారని పేర్కొన్నా రు. నేడు ఐటీలో ప్రపంచాన్ని భారత్ శాసిస్తోందంటే మన్మోహన్ సరళీకృత విధానమేనని కారణమని అన్నారు. రాష్ట్రంతో మన్మోహన్ సింగ్‌కు విడదేయలేని బంధం ఉందన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ శాశ్వతమేనన్నారు. గొప్ప తత్వవేత్త, మానవతావాదిని కోల్పోవడం దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని, వరుసగా రెండు పర్యాయాలు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్ గా ఎనలేని సేవలు అందించారని రేవంత్ గుర్తుచేశారు. ప్ర ణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారని చెప్పారు.

భారతరత్న పురస్కారం ఇవ్వాలి

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్నపురస్కారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఉ పాధి హామీ, ఆర్టీఐ లాంటి చట్టాలు చేసిన ఘటన మాజీ ప్ర ధాని మన్మోహన్ సింగ్‌కే దక్కిందన్నారు. సరళీకృత విధానాలతో ప్రపంచలో భారత్పో టీ పడేలా చేశారని గుర్తు చేశారు. దేశం ఓ గొప్ప తత్వవేత్తను కోల్పోయిందని ఎమోషనల్ అ య్యారు. ప్రపంచమే గర్వించదగిన ఆర్ధిక వేత్తను కోల్పోవ డం నిజంగా తీరని లోటని పేర్కొన్నారు. దివంగత మాజీ ప్ర ధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని సీ ఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పని చేశారని చెప్పారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, కేంద్ర ఆ ర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి విశేషమైన సేవలందించారని పేర్కొన్నారు. 199196 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆ యన ఊపిరిలూదారని రేవంత్ రెడ్డి వివరించారు. మన్మోహ న్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2014 లో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆ మోదించిందన్నారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగా ణ ఏర్పడిందని రేవంత్ వివరించారు. మన్మోహన్ సింగ్ ఎల్‌పీజీ(లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలిపారని తెలిపారు. సామాజిక విప్లవ కార్యక్రమమైన ఆధార్‌ను మన్మోహన్ ప్రారంభించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.ఆయనకు భారతరత్న ఇ వ్వాలని ఈ సభ తీర్మానం చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం

2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలకు న్యాయం జ రిగేలా చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. 2006లో అటవీ హక్కుల చట్టానికి సవరణలు చేసి ఆదివాసీలను ఆదుకున్నారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఐటీ రంగంలో శాసించగలుగుతున్నామంటే మన్మోహన్ విధానాలే కారణన్నారు. ఆయన తెలంగాణకు ఆత్మబంధువని రేవంత్ అభివర్ణించారు. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ బిల్లులను 2 సభల్లో పాస్ చే యించిన సారథిని అని అన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది: డిప్యూటీ సిఎం భట్టి

మానవతా ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం శాసనసభలో మాట్లాడిన భట్టి విక్రమార్క మన్మోహన్ సింగ్ నిర్ణయాలు పేదలను దారిద్య్రం నుంచి బయటపడేశాయని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం మ న్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్ర ధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింప చేశారని గు ర్తు చేశారు. దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసి న ప్రధాని మన్మోహన్ సింగ్ అని నేడు రాష్ట్రంలో రెండు లక్ష ల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మన్మోహన్ అన్నారు.

దేశాభివృద్ధికి ఎన్నో గొప్ప విధానాలు తెచ్చారు : మంత్రి శ్రీధర్‌బాబు

దేశాభివృద్ధికి మన్మోహన్ సింగ్ అనేక గొప్ప విధానాలు తీసుకొచ్చారని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేసుకున్నారు. ఆయన సాధారణ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారని కొనియాడారు. గ్రామీణ పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ తెచ్చారని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ పటిష్ఠంగా ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. సామాన్య ప్రజలకు ఆయుధమైన ‘ఆర్టీఐ’, ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ‘ఆధార్’ తెచ్చారన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో రాష్ట్రాల్లో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారని వివరించారు.

రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్ : ఉత్తమ్

మన్మోహన్ సింగ్ హయాంలోనే విప్లవాత్మక భూసేకరణ చ ట్టం వచ్చిందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. దేశ క్షేమం దృష్ట్యా మన్మోహన్ సింగ్ న్యూక్లియర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు. రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్ సింగ్. సోనియా గాంధీ సూచనల మేరకు ఆయన గొప్ప చట్టాలు తెచ్చారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నవారు జవాబుదారీగా ఉండాలని సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ దేశం కోసం విశిష్ట సేవలందించారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఖ్యాతి గడించారు. ఆర్థిక శాఖ సలహాదారుగా,ఆర్‌బిఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, ఆర్థిక మంత్రిగా సేవలందించారు. అంతకుమించి తెలంగాణ విషయానికి వస్తే ఆయన మనకు ఆత్మబంధువు. 60ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు. ఎల్‌పిజి విధానాలతో దేశ ఆర్థిక రంగంలో సుస్థిరత్వాన్ని తీసుకొచ్చారు. ఉపాధి హామీ, సమాచార హక్కు, ఆధార్ తదితర విప్లవాత్మక సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మేధావి. అన్నింటికి మించి నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన ఆర్థిక వేత మన్మోహన్ మృతి తీరని లోటు. భావి తరాలు ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నందున ఆయనకు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ప్రకటించాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ విగ్రహాన్ని నెలకొల్పుతాం.
రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

మన్మోహన్ గొప్పతనాన్మి మొదటిసారి గుర్తించింది తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు. మన్మోహన్, పివి ద్వయం దేశంలో విప్లవాత్మక సంస్కరణలు, సమూల మార్పులు తీసుకొచ్చారు. సింపుల్ లివింగ్..హై థికింగ్ అనే మాటకు పర్యాయపదం మన్మోహన్ సింగ్. ఆయన కేబినెట్‌లో కెసిఆర్ కూడా పనిచేశారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్రం మన్మోహన్ సారథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఆయనను ఎంత మంది ఎన్ని రకాలుగా అవమానించినా బెణకలేదు. ఆయనకు భారత్నరత్న ఇవ్వాలి. అదే సమయంలో ఢిల్లీలో మన్మోహన్‌కు దక్కిన గౌరవం పివికి దక్కలేదు. పివికి కూడా ఢిల్లీలో స్మారక కట్టడం నిర్మించాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలి.
కెటిఆర్, బిఆర్‌ఎస్

మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలు ఎన్నటికీ మరువబోరు. ఢిల్లీలోని నిగమ్‌బోథ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థంగా స్మారక చిహ్నం ఏర్పాటు చేయబోతుంది. గతంలో పివి నరసింహారావుకు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ ఆయన కోసం అంగుళం స్థలం కూడా కేటాయించలేదు. ఓవైపు మాజీ ప్రధాని మన్మోహన్ చనిపోతే వారం రోజుల పాటు సంతాప దినాలు నడుస్తుండగానే రాహుల్ గాంధీ మాత్రం కొత్త సంవత్సర వేడుకలకు వియత్నాం వెళ్లడం ఆయనను అవమానించడమే.
మహేశ్వర్ రెడ్డి, బిజెపి

దేశ గతిని, గమనాన్ని మార్చిన వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. నిజాయితీ, నిబద్ధతకు ఆయన నిలువుటద్దం. సంతాప సభ జరుగుతుండగా రాహుల్ గాంధీ గురించి బిజెపి పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. ఇలాంటి కార్యక్రమంలో రాజకీయాలు తగదు. సంతాప సభల్లో ఇతర అంశాలను జోడించడం ఇంతకుముందు నేనెన్నడూ చూడలేదు. మన్మోన్ ఆత్మ క్షోభిస్తుంది. ఇలాంటప్పుడు ఆయన గొప్పతనాన్ని మాత్రమే చెప్పాలి. కెటిఆర్ సభా సంప్రదాయాలకు అనుగుణంగా మాట్లాడారు.
కూనంనేని సాంబశివరావు, సిపిఐ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News