Thursday, April 17, 2025

పెళ్లికి వెళ్లి వస్తుండగా నదిలో పడిన వ్యాన్: 66 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అదీస్ అబబా: దక్షిణ ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం వ్యాను అదుపు తప్పి గెలాన్ వంతెన పైనుంచి నదిలో పడిపోవడంతో 66 మంది మృతి చెందారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలకు ఆలస్యం జరగడంతో ఎక్కువ మంది మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కర్రల సహాయంలో బాధితులను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News