Sunday, January 5, 2025

బుమ్రా ఒక్కడే!

- Advertisement -
- Advertisement -

ఐసిసి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎంపిక
రేసులో మరే బౌలర్‌కు దక్కని చోటు

దుబాయ్: టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డుకు ఎంపికైన క్రికెటర్ల జాబితాను ఐసిసి సోమవారం విడుదల చేసింది. 2024లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు కల్పించింది. బ్యాటింగ్ విభాగంలో జో రూట్(ఇంగ్లండ్), హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్), కమిందు మెండీస్(శ్రీలంక)లను ఎంపిక చేయగా.. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా(భారత్) ఒక్కడినే ఎంపిక చేసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ అవార్డు రేసులో లేకపోవడం గమనార్హం. 29 ఇన్నింగ్స్‌ల్లో 1478 పరుగులు చేసిన జైస్వాల్ ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

అయితే జైస్వాల్‌ను కాకుండా అతని కంటే తక్కువ పరుగులు చేసిన కమిందు మెండీస్, హ్యారీ బ్రూక్ ఈ అవార్డు రేసులో నిలిచారు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఈ ఏడాది 31 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగి 1556 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. అందులో ఆరు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. ముల్తాన్ టెస్ట్‌లో రూట్ పాకిస్థాన్‌పై డబుల్ సెంచరీ (262) తో కదంతొక్కాడు. బ్రూక్ ఈ ఏడాది 20 ఇన్నింగ్స్‌ల్లో 1100 పరుగులు చేశాడు. అందులో నాలు గు శతకాలు, మూడు అర్ధ శతకాలున్నాయి. పాకిస్థాన్‌తో జరిగిన ముల్తాన్ టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ (317) చేశాడు. దీంతో బ్రూక్ నాలుగో స్థానంలోకి దూసుకొచ్చాడు. శ్రీలంక యువ ఆటగాడు కమిందు మెండీస్ ఈ ఏడాది 16 ఇన్నింగ్స్‌ల్లో 74.92 సగటుతో 1049 పరుగులు చేశాడు. దీంతో కమిందు ఐదోస్థానంలో నిలిచాడు.

బుమ్రా అద్భుత ప్రదర్శన..

బుమ్రా ఈ ఏడాది బాల్‌తో అద్భుతం చేశాడు. ఈ ఏడాది 13 టెస్ట్‌ల్లో 14.92 సగటున 71 వికెట్లు పడగొట్టి, మరే బౌలర్‌కు సాధ్యపడని ఫీట్‌ను సా ధించాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో నిలిచా డు. బమ్రాకు దరిదాపుల్లో ఏ బౌలర్ లేడు. ఇం గ్లండ్ పేసర్ గస్ అట్కిన్‌సన్, బుమ్రా తర్వాత అత్యధికంగా 52 వికెట్లు పడగొట్టాడు. ఆతర్వాతి స్థానాల్లో మహ్మద్ సిరాజ్ (35), పాట్ కమిన్స్ (37), టిమ్ సౌధీ (17) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News