Sunday, January 5, 2025

పోలీస్ స్టేషన్ లో ఎస్ఐపై దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐపై దాడికి పాల్పడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ఈ కేసులో ఆరుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజుపాళేం గ్రామానికి చెందిన చిన్నలింగమయ్య, హర్ష అనే యువకులు బైక్‌పై వెళ్తుండగా వారిని కారు ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ మహమ్మద్ రఫీ అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం గమనించాడు. గాయపడిన వారిని తన జీపులో ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ వెంకటరెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపించారు. క్షతగాత్రులు బంధువులు స్టేషన్‌కు వచ్చి కారు ధ్వంసం చేయడంతో పోలీసులకు ఘర్షణకు దిగారు. ఇంట్లో ఉన్న ఎస్‌ఐకి సమాచారం ఇవ్వడంతో మఫ్టీలో ఆయన స్టేషన్‌కు చేరుకున్నారు. చిన్న లింగమయ్య సోదరుడు లింగమయ్య ఎస్‌ఐపై దాడి తెగపడ్డాడు. ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ యుగంధర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News