Sunday, January 5, 2025

మంగళవారం రాశి ఫలాలు (31-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఊరటను కలిగించే తీపి కబుర్లు వింటారు.  అత్యాశకు దూరంగా ఉంటారు. తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రాధాన్యతని ఇస్తారు.

వృషభం – కుటుంబ సంబంధమైన కలహాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలలో భాగస్వాములు పరోక్షంగా సొంత లాభాలు చూసుకొని సామూహిక, సంస్థాగత ప్రయోజనాలను పట్టించుకోరు.

మిథునం –  ఉద్యోగ పరంగా అభివృద్ధి బాగుంటుంది. మీరు ఎవరితో పోల్చుకోరు మీ పని మీది వాళ్ళ పని వాళ్ళది అనే ధోరణితో మెలుగుతారు. ప్రతి విషయంలోనూ మంచి ఫలితాలు వచ్చేవరకు కృషి చేస్తారు.

కర్కాటకం – మీకు దక్కవలసిన ప్రయోజనాలకు స్వల్పమైన సాంకేతిక సమస్యలు ఏర్పడతాయి. దాని గురించి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాస్త ఆలస్యమైన మీ ప్రయోజనాలు మీకు అందుతాయి.

సింహం – వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సక్రమమైన ఫలితాలు ఇవ్వవు.  ఏకపక్ష నిర్ణయాలు కూడా కలిసి రావు. కుటుంబ సభ్యులను ఒప్పించలేక మానసిక ఒత్తిడికి లోనవుతారు.

కన్య – చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. సహోదర సహోదర వర్గానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి.

తుల – ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. విందు వినోదాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు ఉపకరిస్తాయి. అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి.

వృశ్చికం – నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. ప్రయాణాలు అంతగా అనుకూలించవు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి.

ధనుస్సు – ప్రపంచాన్ని ఇప్పుడు మీరు చూసే కోణంలో కాకుండా కొత్త కోణంలో చూస్తారు. అవసరాలకు సరిపడధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఆనందకరమైన సమయాన్ని గడపగలుగుతారు.

మకరం – ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెంచుకోగలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయ వర్గం అన్ని విధాల సహకరిస్తారు.

కుంభం – వృత్తి ఉద్యోగాలపరంగా సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యపరమైన చిక్కులు తప్పకపోవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలలో మెలకువలు అవసరం.

మీనం – అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అవసరాలకు సరిపడా ధనం చేతిలో ఉంటుంది. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News