Sunday, January 5, 2025

నాలుగేళ్ల బాలుడిని గొడ్డలితో నరికి చంపారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: నాలుగేళ్ల బాలుడిని గొడ్డలితో నరికి చంపారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎటపాక మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లక్ష్మీపురం పంచాయతీ మద్దిమడుగు గ్రామంలో వెంకటేశ్-రమ్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముర్రం కోటేశ్వరరావు సోదరితో వెంకటేశ్ చిన్న కుమారుడు నాగరాజు(04) మట్టి తీసుకరావడానికి పొలం వద్దకు వెళ్లారు. ముర్రం కోటేశ్వరరావు అక్కడే ఉండడంతో గొడ్డలితో బాలుడిపై దాడి చేశాడు.

దీంతో ఘటనా స్థలంలోనే బాలుడి చనిపోయాడు. వెంటనే తన సోదరిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆమె అక్కడి నుంచి తప్పించుకొని గ్రామస్థులకు సమాచారం ఇచ్చింది. గ్రామస్థులు అక్కడికి చేరుకునేసరికి నిందితుడు పారిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోటేశ్వరరావు మతిస్థిమితం సరిగా లేదని, అతడు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని గ్రామస్థులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News