Sunday, January 5, 2025

ఐఫోన్ లవర్స్ కు పండగే.. ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్!

- Advertisement -
- Advertisement -

మరి కొన్ని గంటల్లో 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఇందులో భాగంగా టెక్ ప్రియులను ఆకర్షిందేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో వివిధ గాడ్జెట్స్ పై భారీ తగ్గింపు ఆఫర్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిస్కౌంట్‌తో కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సేల్ ఉత్తమ అవకాశం. ఈ క్రమంలో అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక డీల్ గురించి చూద్దాం.

యాపిల్ iPhone 14 అనేక ఆఫర్‌లతో అమెజాన్ లో అందుబాటులో ఉంది. నేరుగా అమెజాన్ నుంచి కొనుగోలు చేస్తే చాల డబ్బును అధ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

ఆఫర్

ఐఫోన్ 14 అన్ని వేరియంట్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో భాగంగా 128జిబి, 256జిబి 512జిబి స్టోరేజ్ ఆప్షన్లలో ఉన్నాయి. అయితే, 256జిబి మోడల్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. దీని ధర అమెజాన్‌లో రూ. 79,900గా ఉంది. కానీ, కంపెనీ 19 శాతం తగ్గింపు ప్రకటించగా కేవలం ఈ ఫోన్ రూ. 64,900లకు మాత్రమే లభిస్తోంది. అంటే దాదాపు రూ. 15,000 ఆదా అవుతుందని అర్థం.

19 శాతం తగ్గింపుతో మాత్రమే కాకుండా ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కస్టమర్‌లు 256 జిబి వేరియంట్‌ని 2,924 రూపాయల సులభమైన నెలవారీ EMIతో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ద్వారా రూ.27,350 వరకు ఆదా చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు

కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 14 ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికీ ఎంతో ఉపయోగకరంగా ఉటుంది. ఇది DSLR నాణ్యత షాట్‌లను క్లిక్ చేయడం లో సహాయపడుతుంది. ఐఫోన్ 14 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంద. ముందు 12MP సెన్సార్, వెనుక 12MP సెన్సార్‌తో వస్తుంది. ఇందులో A15 బయోనిక్ చిప్‌సెట్ ని అమర్చారు. ఈ ఫోన్ లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1200 nits పీక్ బ్రైట్‌నెస్, 1170 x 2532 పిక్సెల్‌ల రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News