Sunday, January 5, 2025

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే ప్రోటీన్‌ లోపం ఉన్నట్లే..

- Advertisement -
- Advertisement -

మారుతున్న కాలంతో పాటు తీసుకునే ఆహారాలు కూడా మారుతున్నాయి. మనం తీసుకునే ఆహారం బట్టి మన అర్యోగం ఉంటుంది. ఇకపోతే, ప్రొటీన్లను మన ఆర్యోగనికి చాలా అవసరం. వీటిని మన శరీరంలోని బిల్డింగ్ బ్లాక్స్ అని కూడా అంటారు. కండరాలు, ముకలు, చర్మం, జుట్టు నిర్మాణంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందువల్ల, శరీరంలో సరైన మొత్తంలో ప్రోటీన్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రొటీన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి ఏమిటి? ఎలా అధిగమించాలో? మనం ఈ ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రోటీన్ లోపం సంకేతాలు

శరీరానికి శక్తి ఇవ్వడానికి ప్రోటీన్ ముఖ్యమైన మూలం. దీని లోపం కారణంగా, మనం నిరంతరం అలసిపోతాము. ఈ లోపం వల్ల చిన్న పనులు చేయడంలో కూడా ఇబ్బంది పడొచ్చు.

కండరాలను నిర్మించడంలో ప్రోటీన్ ఎంతో సహాయపడుతుంది. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే, బరువు తగ్గవచ్చు. అందుకే అధికంగా ఉన్న ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి.

జుట్టు, గోర్లు ప్రధానంగా మనం తీసుకునే ప్రోటీన్‌ ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. ప్రొటీన్ లోపం వల్ల జుట్టు రాలడంతోపాటు గోళ్లు బలహీనంగా, సన్నగా మారతాయి.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. తక్కువ ప్రోటీన్ తీసికుంటే చర్మం పొడిగా, గరుకుగా, పగుళ్లు ఏర్పడుతాయి.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రోటీన్ ఎంతో సహాయపడుతుంది. ప్రోటీన్ కలిగిన ఆహారాలు తీసుకోకపోతే వల్ల మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతారు.

గాయాలను నయం చేయడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. ఒకవేళ సరైన ప్రోటీన్ ఆహారం తీసుకోవడం మానేస్తే గాయాలు నెమ్మదిగా నయం అవుతాయి.

ప్రొటీన్ గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్లను నియంత్రిస్తుంది. ఇది ఆకలిని, నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అందువల్ల ప్రోటీన్ లోపం కారణంగా, తక్కువ లేదా ఎక్కువ ఆకలితో ఉండవచ్చు.

 

ప్రోటీన్ లోపాన్ని అధిగమించే ఆహారాలు ఇవే

1. మాంసం – చికెన్, చేపలు, గుడ్లు
2. పాల ఉత్పత్తులు – పాలు, పెరుగు, జున్ను, మజ్జిగ
3. పప్పులు, బీన్స్ – మూంగ్ పప్పు, గ్రాము, బీన్స్,
4. గింజలు – బాదం, వాల్‌నట్, జీడిపప్పు, చియా గింజలు, అవిసె గింజలు
5. సోయా ఉత్పత్తులు – టోఫు, సోయా పాలు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News