Sunday, January 5, 2025

కొడాలి నాని అనుచరుడు కాళీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీని పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడ టిడిపి కార్యాలయం, రావి వెంకటేశ్వరావుపై దాడిలో కాళీ కీలక సూత్రధారి కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇదే కేసులో 13 మంది వైసిపి నాయకులు రిమాండ్ లో ఉన్నారు. ఈ ఘటనలో సూత్రధారి కాళీని అస్సాంలో గుడివాడ పోలీసు బృందాలు పట్టుకున్నాయి. వైసిపి అధికారంలో ఉండగా గడ్డం గ్యాంగ్ ముసుగులో కాళీ అనేక అరాచకాలు సృష్టించినట్టు పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా వైసిపి యువజన విభాగ అధ్యక్షుడిగా కాళీ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News