Sunday, January 5, 2025

2025లో మార్కెట్లోకి రానున్న ఎలక్ట్రిక్ కార్లు..

- Advertisement -
- Advertisement -

కొన్ని గంటల్లో 2025 ఇయర్ లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాదిలో అనేక ప్రసిద్ధ ఆటో కంపెనీలు కొత్త వాహనాలను, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి రిలీజ్ చేసాయి. అయితే, ఈ వచ్చే ఏడాది 2025 లో కూడా అనేక ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకుంటానున్నాయి. ఇందులో మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా, టయోటా, మహీంద్రా & మహీంద్రా ఆటో కంపెనీలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అన్ని ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాదిలో రానున్న ఎలక్ట్రిక్ వాహనాల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.

1. హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ తన ప్రసిద్ధ మోడల్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయనుంది.ఈ 5-సీట్ల ఎలక్ట్రిక్ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 450 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ వాహనం EV-నిర్దిష్ట టచ్‌లతో పాటు ఇప్పటికే ఉన్న క్రెటా ఇంటీరియర్, ఎక్ట్సీరియర్‌తో అమర్చబడి రానున్నది.

2. టయోటా అర్బన్ క్రూయిజర్

జపనీస్ కంపెనీ టయోటా కూడా 2025 సంవత్సరంలో భారత మార్కెట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ EVని విడుదల చేయనుంది. మారుతి అనుబంధ సంస్థ అర్బన్ క్రూయిజర్ EV పేరుతో e-Vitara డెరివేటివ్‌ను పరిచయం చేస్తుంది. అయితే, ఇది రెండు బ్యాటరీ ఎంపికలతో మార్కెట్లోకి కూడా విడుదల కానున్నది. టయోటా అర్బన్ క్రూయిజర్ EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణిస్తుంది.

3. మారుతి సుజుకి ఇ వితారా

దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ మారుతి సుజుకి ఇ వితారాను వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి తీసుకురానున్నది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ కార్ రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో రానున్నది. ఈ కారు గరిష్టంగా 500 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్తుంది. ఇది నేరుగా హ్యుందాయ్ క్రెటా EVతో పోటీపడుతుంది.

4. మహీంద్రా

మహీంద్రా & మహీంద్రా ఎస్యువి మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇప్పుడు ఈవీ మార్కెట్‌లోనూ తన సేల్స్ ని పెంచుకునేందుకు సిద్ధమైంది. టాటా మోటార్స్ సరసమైన EVకి పోటీగా కంపెనీ త్వరలో XUV 3XO EVని పరిచయం చేయనుంది. ఈ ఎస్‌యూవీ పరిధి 400 కిలోమీటర్లు ఇస్తుంది. అంతేకాకుండా.. కంపెనీ ఇందులో అనేక అద్భుతమైన ఫీచర్లను అందించనుంది.

5. టాటా హ్యారియర్

భారతదేశంలో EVలకు పెరుగుతున్న డిమాండ్‌ను ఉపయోగించుకోవడానికి టాటా మోటార్స్ కూడా సిద్ధంగా ఉంది. టాటా 2025 సంవత్సరంలో టాటా హ్యారియర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ఈ ఎలక్ట్రిక్ వాహనం సింగిల్, డ్యూయల్-మోటార్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. దీని పరిధి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది అని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News