Sunday, January 5, 2025

మైసూరు ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో చిరుత సంచారం

- Advertisement -
- Advertisement -

మైసూరు ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో మంగళవారం ఓ చిరుత సంచరించడాన్ని గుర్తించారు. దాంతో వెంటనే అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ సంరక్షణ సహాయాధికారి(ఏసిఎఫ్) రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ ‘ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు చిరుతను చూశారు. అది సిసిటివి ఫుటేజ్ ద్వారా కూడా ధృవపడింది. సమాచారం అందగానే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు ఓ పశువైద్యుడు(వెటర్నేరియన్) సహా అటవీ శాఖకు చెందిన 50 మంది సిబ్బంది బృందం గాలింపు చర్యలు మొదలెట్టింది. చిరుతను పట్టుకునేందుకు మేము బోను, నెట్ తో సిద్ధంగా ఉన్నాము’ అని తెలిపారు. కాగా ‘చిరుతను సెక్యూరిటీ సిబ్బంది అండర్‌గ్రౌండ్ కార్ పార్కింగ్ ఏరియాలో కనుగొన్నారు.

మాకు తెల్లవారు జామున 4 గంటలకు సమాచారం అందింది. మేము అక్కడికి 5 గంటలకల్లా చేరుకున్నాము. చిరుతను పట్టుకునే పని మొదలెట్టాము. మేము పగటి వేళ సాధారణ డ్రోన్‌ను ఉపయోగిస్తున్నాము. కానీ రాత్రి వేళ థర్మల్ డ్రోన్ ఉపయోగించాలని యోచిస్తున్నాము’ అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నదీమ్ తెలిపారు. చిరుతను పట్టుకునే ఆపరేషన్‌కు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (మైసూర్ వైల్డ్‌లైఫ్ డివిజన్) ఐబి. ప్రభు గౌడ నేతృతం వహిస్తుండగా, ఏసిఎఫ్ పరమేశ్వర్, ఆర్‌ఎఫ్‌ఓ నదీమ్, వెటర్నేరియన్ ఆదర్శ్, వెటర్నేరియన్ అసిస్టెంట్ అక్రమ్ తదితరులు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఇక ఇన్ఫోసిస్ కంపెనీ సిబ్బంది భద్రత రీత్యా వారిని మంగళవారం ఇంటి నుంచే పనిచేయమని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News