Sunday, January 5, 2025

నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై చిరుత సంచారం

- Advertisement -
- Advertisement -

నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై చిరుతపులి సంచరించింది. నిర్మల్ జిల్లా, దిలావర్‌పూర్ మండలం, లోలం= సిర్గాపూర్ గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయానికి వెళ్లే రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున వాహనాల్లో వెళ్తున్న ప్రయాణికులకు రోడ్డు దాటుతున్న చిరుత పులి కనిపించింది. దీంతో వారు భయభ్రాంతులకు గురై వాహనాలను కాసేపు నిలిపివేశారు. చిరుతపులిని పలువురు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి, వివిధ మాధ్యమాల్లో ప్రసారం చేశారు. కాగా, చిరుతపులి సంచారంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు వ్యవసాయ పనులకు వెళ్లడానికి భయపడాల్సి వస్తోందని, ఫారెస్ట్ అధికారులు దానిని పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలించాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News