Sunday, January 5, 2025

అంతరిక్షంలో వ్యోమగాములకు 16 సార్లు న్యూఇయర్

- Advertisement -
- Advertisement -

విశ్వంపై కొత్త ఏడాది ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని దేశాలు 2025 ఏడాదికి ఘనంగా స్వాగతం పలికాయి. కిరిబాటి దీవి , న్యూజిలాంండ్ ప్రజలు కొత్త ఏడాది లోకి అడుగుపెట్టారు. అయితే సాధారణంగా భూమి మీద ఉన్న ప్రజలు కొత్త ఏడాదికి ఎన్నిసార్లుస్వాగతం పలుకుతారు ? ఒక్కసారే కదా ! . అయితే అంతరిక్షం లోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్) లో ఉన్న వ్యోమగాములు మాత్రం 16 సార్లు ఈ అనుభూతిని సొంతం చేసుకుంటారు. దీనికి కారణం ఏమంటే ఐఎస్‌ఎస్ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుండడమే .

దీంతో 90 నిమిషాల్లో భూమి చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఎస్ లోని వ్యోమగాములు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి భూమిపై పగలు, 45 నిమిషాల తరువాత రాత్రిని చూస్తారు. మరోవైపు ఐఎస్‌ఎస్ ఒక రోజులో భూమి చుట్టూ 16 సార్లు పరిభ్రమిస్తుంది. దీంతో అందులోని వ్యోమగాములు ప్రతి రోజు 16 సార్లు సూర్యోదయాన్ని , 16 సార్లు సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తారు. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఎస్ లోని వ్యోమగాములు కొత్త ఏడాదికి 16 సార్లు స్వాగతం పలుకుతారు. తద్వారా న్యూఇయర్‌ను 16 సార్లు జరుపుకునే అరుదైన అవకాశం వారికి లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News