Sunday, January 5, 2025

23 ఏళ్ల తరువాత యాజమాన్య హక్కులు

- Advertisement -
- Advertisement -

ముంబయిలోని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల్లో ఒకదాని కొనుగోలుకు ధైర్యం చేసిన ఉత్తర ప్రదేశ్ వాసి ఒకరు 23 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం దాని యాజమాన్య హక్కులు పొందారు. యుపి ఫిరోజాబాద్ వాసి అయిన హేమంత్ జైన్ 2001లో వేలంలో ఒక షాపును కొనుగోలు చేశారు. ఆయన కొన్ని రోజుల క్రితం తన పేరిట ఆ షాపును రిజిస్టర్ చేయించుకున్నారు. 1993 ముంబయి ఉగ్ర దాడుల సూత్రధారి, పాకిస్తాన్ కరాచచీలో నివసిస్తున్నట్లుగా భావిస్తున్న దావూద్ యాజమాన్యంలోని 144 చడరపు అడుగుల షాపును తాను రూ. 2 లక్షలకు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ నుంచి వేలంలో కొన్నట్లు జైన్ తెలియజేశారు. ‘దావూద్ ఆస్తులకు కొనుగోలుదారులు రావడం లేదని ఒక దినపత్రికలో నేను చదివిన తరువాత జయ్‌రాజ్ భాయ్ వీధిలో

ఒక ఇరుకు సందులో గల షాపు కొనుగోలుకు బిడ్ వేశాను’ అని 55 ఏళ్ల జైన్ తెలిపారు. వేలంలో కొనుగోలు చేసిన తరువాత షాపు యాజమాన్య హక్కులు పొందేందుకు తాను సుదీర్ఘ పోరాటం సాగించవలసి వచ్చిందని ఆయన చెప్పారు. ‘ఐటి అధికారులు ఆదిలో సహకరించలేదు& ఈ విషయంలో జోక్యం కోరుతూ పిఎంఒకు నేను అనేక లేఖలు రాయవలసి వచ్చింది’ అని ఆయన తెలిపారు. ఆ ఆస్తికి సంబంధించిన ఫైలు రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అందుబాటులో లేదని, దానితో తాను కోర్టును ఆశ్రయించవలసి వచ్చిందని, యాజమాన్య హక్కులు పొందేందుకు ఐటి ఆఫీస్, ముంబయి పోలీసుల చుట్టూ తాను తిరిగినా ఫలితం లేకపోయిందని జైన్ చెప్పారు. ఆ షాపు భౌతిక స్వాధీనం కోసం తాను వచ్చే నెల ముంబయికి వెళ్లనున్నట్లు జైన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News