Monday, January 6, 2025

బడ్జెట్‌పై కసరత్తు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను జనవరి 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేయాల్సిందిగా ఆర్థికశా ఖమంగళవారం ఆదేశాలు జా రీ చేసింది. ఈ మేరకు అన్ని శా ఖలకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వు లు జారీ చేసారు. ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటూనే, 2025-26 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన రివైజ్డ్ బఢ్జెట్ అంచనాలను రూపొందించుకోవాలని ఆర్థికశాఖ సూచించింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అమలు చేస్తోన్న ప్రస్తుత సంక్షేమ, పథకాలతో పాటు అభివృద్ధి కా ర్యక్రమాలకు అవసరమైన నిధులతో పాటు సామాజి క, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రతిపాదనలు తయారు చే యాలని సర్క్యూలర్‌లో పే ర్కొన్నారు.

అలాగే వచ్చే ఆ ర్థిక సంవత్సరంలో అమ లు చేయనున్న వాటికి సం బంధించిన అంచనాలను చేర్చి ప్రతిపాదనలు తయారు చేయాలని పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించిన జీ తభత్యాలు, అలవెన్స్‌లు, కాంట్రాక్టు, అవుట్ సో ర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అవసరమైన ని ధుల అంచనాలను కూడా సమర్పించాల్సిఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్యోగులే కాకుండా కొత్తగా నియామకం అయ్యే ఉద్యోగ నియామకాలను దృష్టిలో పెట్టుకొని వాటి అంచనాలను కూడా బడ్జెట్‌లో ప్రతిపాదనల రిమార్క్ కాలమ్‌లో పేర్కొనాల్సి ఉంటుందని సూచించింది. వచ్చే ఆర్థిక సం వత్సరంలో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను, రా ష్ట్రం చెల్లించిన పన్నుల నుంచి వచ్చే వాటాలను అంచనా వేసి ఈ ప్రతిపాదనలను తయారు చేయా ల్సి ఉంటుందని

ఆర్థికశాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ రాబడితో పాటు ప్రభుత్వ నిర్వాహణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. బడ్జెట్ అంచనాలు రూపొందించడంలో సమర్థవంతమైన పరిపాలన, మౌలిక సదుపాయాల మెరుగు, ఉపాధి అవకాశాల పెంపుదలతో పాటు రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుదల, సమాజంలో ఆర్థిక అసమానలతలను రూపుమాపడం, రాష్ట్ర ఆర్థిక నిలువలను, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడం ప్రధాన లక్షంతో పాటు సమర్థవంతమైన పరిపాలన అందించే ఉద్దేశ్యంగా రివైజ్డ్ బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితులలో జనవరి 4 వ తేది గడువు లోగా ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని ఆర్థికశాఖ ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News