Sunday, January 5, 2025

బుధవారం రాశి ఫలాలు (01-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు. మానసిక సంతృప్తితో మెలుగుతారు. బంధువులు, స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. శుభవార్తలు అందుకుంటారు.   

వృషభం – నూతన ప్రణాళికలను ఏర్పరచుకుంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. తధానుగుణంగా అడుగులు వేస్తారు.మానసిక ఆనందం కలిగి ఉంటారు.    

మిథునం – ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులను సానుకూల పరుచుకోగలుగుతారు. కీలక వ్యవహారాలలో ముందడుగు వేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

కర్కాటకం –  ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి అడుగు వేయాలి. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభ ఫలితాలు కలుగుతాయి. 

సింహం – సమాజంలో కీర్తి పెరుగుతుంది సంతోషకరమైన కాలాన్ని గడపగలుగుతారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి చిత్తశుద్ధితో పనులను పూర్తి చేయగలుగుతారు. 

 కన్య – మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృధా కానీయకండి.

తుల – కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృశ్చికం – శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు బాగుంటాయి.   

ధనుస్సు – మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సంతోషకరమైన వార్త వింటారు.  ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు చూపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి.  

మకరం – ప్రారంభించిన పనులలో విఘ్నాలు ఏర్పడకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి.   

కుంభం – ప్రత్యర్థి వర్గం వారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకోగలుగుతారు. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్యమైన విషయాలలో పురోగతి సాధిస్తారు. 

మీనం – అందరిని కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. కాలం అన్ని విధాల సహకరిస్తుంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News