Tuesday, January 7, 2025

పెద్ద విజయాన్ని అందుకుంటున్న ‘డ్రింకర్ సాయి’

- Advertisement -
- Advertisement -

చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది ‘డ్రింకర్ సాయి‘ మూవీ. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ప్రేక్షకుల ఆదరణ చూసి స్మాల్ ఫిల్మ్ బిగ్ హిట్ అంటూ అటు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

‘డ్రింకర్ సాయి‘లోని కథా కథనాలు, మేకింగ్ అటు మాస్, ఇటు క్లాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఫన్ ఎలిమెంట్స్, లవ్ స్టోరీ, సూపర్ హిట్ మ్యూజిక్, ఫైట్స్..ఇవన్నీ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నాయి. ‘డ్రింకర్ సాయి‘ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News