Tuesday, January 7, 2025

మీకు ఒత్తైన జుట్టు కావాలా ?..ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

- Advertisement -
- Advertisement -

మనం తీసుకునే ఆహారం మీద మన అర్యోగం ఆధారపడి ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారం జుట్టు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కొన్ని ఆహార పదార్థాలు జుట్టుకు చాలా మేలు చేస్తే, మరికొన్ని ఆహారాలు జుట్టుకు హాని కలిగిస్తాయి. ఈ క్రమంలో మీ జుట్టు నల్లగా, పొడవుగా, ఒత్తుగా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకోవాలి. ఇప్పుడు జుట్టు మేలు కోసం తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

1. చక్కెర పదార్థాలు తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. దీంతో వీలైనంత వరకు తీపి పదార్థాలు తినకూడదు.

2. సోడా, ఎనర్జీ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. వీటిలో ఉండే షుగర్, కెఫిన్ జుట్టుకు హాని చేస్తాయి. దీంతో జుట్టు రాలిపోతుంది. వీటికి బదులు పండ్ల జ్యుస్ తాగడం చాలా మంచిది.

3. ప్రాసెస్ చేయబడిన ఆహారం అస్సలు తీసుకోకూడదు. ఇందులో అధిక మొత్తంలో సోడియం, ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయి. ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి.

4. తెల్ల పిండి కూడా మన ఆహారం లో చేర్చుకోకూడదు. ఎందుకంటే తెల్ల పిండిలో పోషకాలు ఉండవు. ఇది జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది.

5. ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు. ఆహారంలో ఎక్కువ ఉప్పు ఉంటె శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. దీని కారణంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది.

6. ఆర్యోగనికి హాని కలిగించే ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ శరీరం నుండి నీటిని గ్రహిస్తుంది. ఇది జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. దీంతో జుట్టు పెరుగుదల ఉండదు.

7. కాఫీ, టీ తక్కువగా తీసుకోవాలి. అలా అని ఎక్కువగా తాగితేయ్ జుట్టుకి చాలా ఇబ్బంది. ఇందులో అధిక మొత్తంలో కాఫీ, టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది.

8. నోటికి రుచి అందించే ఫాస్ట్ ఫుడ్ కి చాలా అంటే చాలా దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్‌లో కేలరీలు, కొవ్వు, సోడియం అధికంగా ఉంటాయి. కనుక ఇవి జుట్టుకు హానికరం. అంతేకాకుండా జుట్టు పెరుగుదల కూడా ఉండదు.

జుట్టుకు మేలు చేసే ఆహారాలు

1. ప్రొటీన్లు – గుడ్లు, పప్పులు, చేపలు, చికెన్.
2. విటమిన్ ఎ – క్యారెట్, బత్తాయి, బచ్చలికూర.
3. విటమిన్ సి – నారింజ, నిమ్మ, జామ.
4. ఐరన్ – పాలకూర, బీట్‌రూట్, మెంతులు.
5. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ – అవిసె గింజలు, బాదం, చేపలు.

నోట్ : పైన సేకరించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పబ్లిష్ చేస్తున్నాము. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News